పత్తి కొనుగోళ్లు ప్రారంభం
ABN , Publish Date - Nov 20 , 2025 | 01:04 AM
జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగారు.
జమ్మికుంట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిన్నింగ్ మిల్లర్లు సోమవారం నుంచి సమ్మెకు దిగారు. మార్కెట్ యార్డు, జిన్నింగ్ మిల్లులు రెండు రోజులు బంద్ ఉండడంతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. జిన్నింగ్ మిల్లర్ల సమస్యల పరిష్కారానికి పది రోజులు సమయం కావాలని సీసీఐ ఉన్నతాధికారులు తెలపడంతో జిన్నింగ్ మిల్లర్లు తమ సమ్మెను తాత్కాలికంగా విరమించుకున్నారు. మార్కెట్ యార్డుకు 45 మంది రైతులు 351 క్వింటాళ్ల విడి పత్తి, ఐదుగురు రైతులు 14 క్వింటాళ్లు గోనె సంచుల్లో విక్రయానికి తీసుకు వచ్చారు. ప్రైవేట్ ట్రేడర్స్ బహిరంగ వేలం ద్వారా గరిష్ఠ ధర 7,090, కనిష్ఠ ధర 5,500 రూపాయలు చెల్లించి కొన్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) 210 క్వింటాళ్ల పత్తి కొన్నది. రెండ రోజుల తర్వాత ఎట్టకేలకు మార్కెట్ మెయిన్ గేట్ తెరుచుకోవడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.