ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్ స్థాయి శిక్షణ
ABN , Publish Date - Aug 08 , 2025 | 12:44 AM
ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరికి కార్పొ రేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు.
సిరిసిల్ల రూరల్/తంగళ్లపల్లి ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులందరికి కార్పొ రేట్ స్థాయి శిక్షణను ఉచితంగా అందిస్తున్నామని కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా అన్నారు. సిరిసిల్లలో మహాత్మాజ్యోతిబా ఫూలే బాలిక విద్యాలయంతోపాటు తంగళ్లపల్లి మండలంలోని బద్దెనపల్లిలోని సాంఘిక సంక్షేమ పాఠశాల, సారంపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల, నేరేళ్లలోని తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్, కళాశాల ల్లో గురువారం అన్‌అకాడమీ అన్‌లైన్ క్లాస్‌లను కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జ్ కేకే మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్య ద్వారానే మార్పులు సాధ్యమని సృష్టం చేశారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ విద్యాలయాల్లో విద్యా ర్థుల కోసం ప్రభుత్వం ఆన్‌లైన్ శిక్షణ తరగతులను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థులు పాఠాలు చక్కగా విని నోట్స్‌లో రాసుకోవాలని సూచించారు. పాఠాలల్లో ఏమైనా సందేహాలు వస్తే నివృత్తి చేసుకోవాలని సూచించారు. విద్యార్ధి జీవితంలో 10 నుంచి ఇంటర్మీడియేట్ తరగతులు కీలమన్నారు. ముఖ్యమైన పా ఠ్యాంశాలలలో బేసిక్ ఇంటర్‌లో ప్రారంభమతాయన్నారు. ఈ కార్య క్రమాల్లో జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, కళాశాల ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.