ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం తోడ్పాటు
ABN , Publish Date - Nov 21 , 2025 | 12:05 AM
దేశ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం తోడ్పాటు అందిస్తోందని సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్షీనారాయ ణ అన్నారు.
సిరిసిల్ల, నవంబరు 20 (ఆంరఽధజ్యోతి): దేశ ఆర్థిక వ్యవస్థకు సహకార రంగం తోడ్పాటు అందిస్తోందని సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ చైర్మన్ రాపెల్లి లక్షీనారాయ ణ అన్నారు. గురువారం పట్టణంలోని సిరిసిల్ల సహ కార అర్బన్ బ్యాంక్ ప్రధా న కార్యాలయంలో సహకా ర వారోత్సవాల ముగింపు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ద్వారా వివిధ పాఠశాలకు ప్రింటర్లు, ప్యూరిఫైడ్ వాటర్‌ఫిల్టర్లు, ఫ్యాన్లు ఇతర సామగ్రిని ఉచితంగా జిల్లా సహకార అధికారి రామకృష్ణ చేతుల మీదుగా అందజేశారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులుకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ దేశాభివృద్ధిలో సహకార సంఘాలు పోషించిన పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనదన్నారు. అన్ని వర్గాల ప్రజలు సహకార రంగాల్లో భాగస్వాములు కావాలని కోరా రు. బ్యాంకు డిపాజిట్లు రూ 94.15 కోట్లు ఉన్నాయ న్నారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించ డానికి మొబైల్ బ్యాంకింగ్ అందుబాటులోకి తీసుకొ స్తున్నామని తెలిపారు. జిల్లా శాఖ అధికారి రామ కృష్ణ మాట్లాడుతూ సహకార వ్యవస్థపై ప్రజల్లో అవ గాహన పెంపొందించడానికి సహకార వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. సహకార స్ఫూర్తితో బ్యాంక్ పాలకవర్గం సేవలందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ వైస్ చైర్మన్ అడ్డగట్ల మురళి, సీఈవో పతిపాక శ్రీనివాస్, సహకార శాఖ అధికారి రమాదేవి, డైరెక్టర్లు గుడ్ల సత్యానందం, పాటి కుమా ర్ రాజు, బుర్ర రాజు, వేముల చుక్కమ్మ, ఎనగం దుల శంకర్, కోడం సంజీవ్, కోఆర్డినేటర్ వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.