ఎస్‌యూలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మె
ABN , Publish Date - Apr 23 , 2025 | 01:03 AM
శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెను మంగళవారం ప్రారంభించారు
గణేశ్‌నగర్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): శాతవాహన విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిరవధిక సమ్మెను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ సెటిల్మెంట్‌గా కాంట్రాక్,్ట, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలీచాలని జీతాలతో పని చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని, తమ కృషిని, కష్టాన్ని ప్రభుత్వం గుర్తించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, పార్ట్ టైం అసిస్టెంట్ ప్రొఫెసర్ల సమ్మెకు విద్యార్థులు, యూనివర్సిటీ సిబ్బంది మద్దతు తెలిపారు.