ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం
ABN , Publish Date - Jun 12 , 2025 | 02:30 AM
ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు.
ఇల్లంతకుంట, జూన్ 11 (ఆంధ్రజ్యోతి) : ప్రజా సమస్యలపై సీపీఐ నిరంతర పోరాటం చేస్తుందని జిల్లా కార్యదర్శి గుంటి వేణు పేర్కొన్నారు. మండల కేంద్రంలో బుధవారం 13వ మహాసభ జరిగింది. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కామ్రేడ్ బద్దం ఎల్లారెడ్డి ఆశయాల సాధనకు పాటుపడాలన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో వేలాది మందిని పొట్టన పెట్టుకుంటూ నిరంకుశ విధానాలను అవలంబిస్తోందన్నారు. ఆది వాసీ బిడ్డల సమస్యలపై చర్చించి పరిష్కరించాలి కానీ అణచివే త విధానం సరైంది కాదన్నారు. సీపీఐ(ఎంఎల్) మావోయిస్టు పార్టీ ప్రధానకార్యదర్శి నంబాల కేశవరావు హత్యపై సిటింగ్ జడ్జీ తో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాబోవు స్థానిక సం స్థల ఎన్నికల్లో ప్రజాతంత్రవాదులతో కలిసి పోటీ చేస్తామన్నారు. నిర్వాసితులకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అమలుచేయాలని, నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షల సహాయం అందివ్వాలని డిమాండ్ చేశారు.మహాసభలో మండల కార్యదర్శిగా తీపిరెడ్డి తిరుపతిరెడ్డితోపాటు మండల కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యుడు మంద సుదర్శన్, మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి, నాయకులు బోడ లక్ష్మారెడ్డి, గొల్లపల్లి శ్రీనివాస్, అబ్బసాని రవి, మంద అనీల్‌కుమార్, పెండెల ఆదిత్య, బండారి చందు, జుట్టు సూర్య, గాండ్ల అనీల్, సావనపెల్లి విష్ణు, రాజు, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.