Share News

సమస్యలపై నిరంతర ఉద్యమాలు..

ABN , Publish Date - Dec 27 , 2025 | 12:23 AM

భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచినా ప్రజలు, కార్మికుల సమ స్యలపై స్పందిస్తూ నూతనోత్సాహంతో నిరంతర ఉదమాలు, పోరాటాలు చేపడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు.

సమస్యలపై నిరంతర ఉద్యమాలు..

సిరిసిల్ల టౌన్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచినా ప్రజలు, కార్మికుల సమ స్యలపై స్పందిస్తూ నూతనోత్సాహంతో నిరంతర ఉదమాలు, పోరాటాలు చేపడుతామని సీపీఐ జిల్లా కార్యదర్శి మంద సుదర్శన్‌ అన్నారు. శుక్ర వారం జిల్లా కేంద్రం సీపీఐ కార్యాలయంలో ఘనంగా సీపీఐ శతాధిక ఆవి ర్భావ వేడుకలకు ప్రారంభించారు. ముందుగా కార్యాలయం ఎదుట సీపీఐ జెండాను జిల్లా కార్యదర్శి సుదర్శన్‌ ఆవిష్కరించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సుదర్శన్‌ మాట్లాడారు. 1925 డిసెంబరు 26న కాన్పూర్‌లో సీపీఐ పార్టీ ఆవిర్భవించిందని నాటి నుంచి దేశ స్వాతంత్య్రం ఉద్యమంలో బ్రిటీష్‌ ప్రభుత్వంతో పోరాటాలు, తెలంగాణ విలీనం కోసం రైతాంగ సాయుధ పోరాటాలు చేసి నిజాం నిరంకుశ పాలనను అంతం చేసి పేదలకు లక్షలాది భూమిని పంచింద న్నారు. భారత స్వాతంత్య్ర అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కార్మి కుల హక్కుల సాధన కోసం ప్రభుత్వ జీవోల అమలు కోసం, కార్మికులకు కనీస వేతనాలు, కాంట్రాక్ట్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని పోరాటాలు చేస్తోందన్నారు. సీపీఐ శతాధిక ఆవిర్భావ వేడుకల్లో భాగంగా 2026 జనవరి 3న వివిధ కార్యక్రమాలు, జనవరి 18న ఖమ్మంలో ఐదు లక్షల మందితో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కడారి రాములు, కేవీ అనసూర్య, అజ్జ వేణు, నల్ల చంద్రమౌళి, వడ్డెపల్లి లక్ష్మన్‌, కొంక విజయ్‌, గాజుల లింగం, అరగొండ శ్రీరాములు, ఆనందం, గాజుల లక్ష్మి, నర్సింగోజి, మారుతి, సీపీఐ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఫ తంగళ్లపల్లి : సీపీఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 18 వ తేదిన ఖమ్మం జిల్లాలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పార్టీ మండల కార్యదర్శి సోమ నాగరాజు పిలుపునిచ్చారు. సీపీఐ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామంలో పార్టీ మండల కార్యదర్శి సోమ నాగరాజు జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎనగంటి రాజు, బచ్చు పల్లి శంకర్‌, శ్రీనివాస్‌, రాజు, కనకయ్య, రాములు, బాలయ్య, గంగాధర్‌, ఆనంద్‌, భూమరాజు, రాంరెడ్డి, వెంకట్రాజం, కిషన్‌, బాల మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ ఇల్లంతకుంట : కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన ఘనత సీపీఐకి దక్కిందని పార్టీ మండల కార్యదర్శి తీపిరెడ్డి తిరుపతిరెడ్డి పేర్కొన్నారు. సీపీఐ ఆవిర్భవించి వంద సంవత్సరాలు గడిచిన సందర్భాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మంద అనీల్‌కుమార్‌, కౌన్సిల్‌ సభ్యులు సావనపెల్లి మల్లేశం, మండల నాయకులు ముత్యాల మల్లారెడ్డి, జుట్టు అఖిల్‌, వేములవాడ హరీష్‌, సావనపెల్లి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 27 , 2025 | 12:23 AM