అప్రమత్తంగా నిరంతర వైద్య సేవలందించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:45 AM
అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 24 గంటలు ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగ స్టు 12 (ఆంధ్రజ్యోతి) : అంబులెన్స్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి 24 గంటలు ప్రజలకు సేవలందించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్ వాహనా లను సిబ్బంది అంది స్తున్న సేవలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత పరిశీ లించారు. 108 వాహనంలో ఆక్సిజన్ నిల్వలు, మానిటర్, ఏఈడీ, బీపీ ఆపరేటర్, లారింజో స్కోప్, అమ్బు బ్యాగ్స్, సర్వైకల్ కాలర్, స్ల్పింట్, ఫోర్ టేబుల్, ఆక్సిజన్ సిలిండర్, స్పైన్ బోర్డ్, అత్యవసర వైద్య పరికరాలు వాటి పని తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ జిల్లాలో భారీ వర్ష సూచనలు ఉన్నందున 108 అంబులెన్స్ వాహనాల సిబ్బం ది అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అత్యవసర సేవలను అందించడానికి సిద్దంగా ఉండాలని సూచించారు. డాక్టర్ రజిత వెంట ప్రోగ్రాం ఆఫీసర్ నయిమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్ధన్, జిల్లా మేనే జర్ అరుణ్‌కుమార్, 108 వాహనాల సిబ్బంది ఉన్నారు.