Share News

నేతన్నలకు నిరంతరం ఉపాధి

ABN , Publish Date - Oct 07 , 2025 | 12:39 AM

నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేతన్నలకు నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వశక్తి సంఘాల మహిళలకు అందించే ఇందిరా మహిళా శక్తి ఏకరూప చీరల బట్ట ఉత్పత్తిని

నేతన్నలకు నిరంతరం ఉపాధి
చీరల ఉత్పత్తిని పరిశీలిస్తున్న మంత్రి సీతక్క

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, నేతన్నలకు నిరంతరం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ(సీతక్క) అన్నారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్వశక్తి సంఘాల మహిళలకు అందించే ఇందిరా మహిళా శక్తి ఏకరూప చీరల బట్ట ఉత్పత్తిని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, చేనేత,జౌళిశాఖ కమిషనర్‌ శైలజ రామయ్యార్‌,సిరిసిల్ల కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ కేకే మహేందర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు పవర్‌లూమ్‌. కార్మికులతో మాట్లాడారు. వారికి లభిస్తున్న కూలి ఇతర విషయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో సీతక్క మాట్లాడుతూ నేతన్నల సుఖసంతోషాలను స్వయంగా చూడటం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడి,్డ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ ఆదేశాలతో నేతన్నలకు 64 లక్షల చీరలు ఆర్డర్లు ఇవ్వడం జరిగిందని అన్నారు. రానున్న రోజుల్లో నేతన్నలకు మరిన్ని ఆర్డర్లు ఇస్తామని అన్నారు. నేతన్నలకు ఉపయోగ పడే యరన్‌ డిపో 50 కోట్లతో వేములవాడలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వం పెట్టిన నేతన్న బకాయిలు ప్రజా ప్రభుత్వం తీర్చిందన్నారు. కోటి మంది మహిళను కోటీశ్వరులను చేయాలని ముఖ్యమంత్రి సంకల్పించారని, మహిళలకు పెట్రోల్‌ బంకులు,సోలార్‌ ప్లాంట్‌ ,ఆర్టీసీ బస్సులు, బస్సులో ఉచిత ప్రయాణం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. మహిళలకు ఆదాయాన్ని సమకూర్చడం కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిందని,మహిళా సంఘాల బలోపేతనికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై కొందరు సుప్రీంకోర్టుకు, మరికొందరు హైకోర్టుకు వెళ్లారని, సుప్రీంకోర్టు తిరస్కరించిందని హైకోర్టులో కూడా బీసీలకు అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావంతో ఉన్నామన్నారు. కాంగ్రెస్‌ సామాజిక న్యాయం పాటిస్తూ రాహుల్‌ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రెడి బిడ్డ అయిన్పటికీ రేవంత్‌ రెడ్డి బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ కులగణన ద్వారా రిజర్వేషన్లను అసెంబ్లీలో ఆమోదింప చేశారని అన్నారు. గవర్నర్‌ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండడం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. దాదాపుగా రెండు సంవత్సరాలుగా ఎన్నికలు లేకపోవడంతో సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు లేకపోవడంతో గ్రామాల్లో అభివృద్ధికుంటూ పడుతుందన్నారు. నోటిఫికేషన్‌ ఇవ్వడంతోనే కొందరు హైకోర్టు, మరికొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. సుప్రీంకోర్టులో తిరస్కరించడం జరిగిందని, హైకోర్టు కూడా బీసీ వర్గాలకు, ప్రభుత్వం ఆశిస్తున్న 42 శాతం రిజర్వేషన్‌ నిర్ణయానికి అనుగుణంగానే హైకోర్టు నిర్ణయం వస్తుందని ఆశాభావంతో ఎదురుచూస్తున్నావని అన్నారు. వచ్చే నెలలో ఇందిరా మహిళా శక్తి చీరలు స్వశక్తి సంఘాల మహిళలకు అందించడం జరుగుతుందన్నారు. మొదట 64 లక్షల మహిళకు చీరలు ఇవ్వాలని నిర్ణయించామని ప్రస్తుతం 67లక్షల వరకు పెంచడం జరుగుతుంద న్నారు.

నేతన్నలను మోసం చేసిన కేటీఆర్‌

-ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

గత ప్రభుత్వం హయాంలో నెంబర్‌ టూగా ఉంటూ యువరాజుగా చలామణి అయిన కేటీఆర్‌ నేతన్నలకు మోసం చేశారని ప్రభుత్వ విప్‌ ఆదిశ్రీనివాస్‌ అన్నారు. నేతన్నలకు ప్రభుత్వం అండగా ఉంటుందని, గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు ప్రజాప్రభుత్వంలో చెల్లించడం జరిగిందని అన్నారు.ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి తోడ్పాటు అందిస్తుందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలు చేయడం చరిత్రలో సువర్ణ అధ్యాయం అన్నారు. దేశంలో 70 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ ఉందని,బీసీ బిల్లును కేంద్రం కావాలని అడ్డుకుంటుందని అన్నారు. బీసీలపై బీజేపీకి ప్రేమ లేక బీసీ బిల్లను షెడ్యూల్‌9లో చేర్చడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ స్వరూప రెడ్డి, కాంగ్రెస్‌ పట్టణ ఆధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్‌, కాంగ్రెస్‌ నాయకులు సంగీతం శ్రీనివాస్‌,సూర దేవరాజు,గడ్డం నర్సయ్య, తాటిపాముల దామోదర్‌, ఎల్లప్ప, ఆకునూరి బాలరాజు, వనిత,శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 12:39 AM