Share News

జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతర కృషి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:43 AM

రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరి అయ్యాయని, సీఎం రేవంతరెడ్డితో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

జగిత్యాల పట్టణాభివృద్ధికి నిరంతర కృషి
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌

ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌

జగిత్యాల టౌన, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అత్యధిక నిధులు జగిత్యాలకు మంజూరి అయ్యాయని, సీఎం రేవంతరెడ్డితో కలిసి పనిచేస్తూ జగిత్యాల పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని 34,35,44 వార్డుల్లో టవర్‌ సర్కిల్‌ నుంచి గీతాభవన వరకు బీటీ రోడ్డు అభివృద్ధి పనులకు శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టవర్‌ వద్ద మార్కెట్‌ను అభివృద్ధిచేసి మార్కెట్‌ ఆలయ అభివృద్ధికి, బ్రాహ్మణవాడ రామాలయం వద్ద ధ్యాన మందిరం నిర్మాణానికి నిధు లు మంజూరు చేసినట్లు తెలిపారు. అర్బన హౌసింగ్‌ కాలనీ మౌలిక సదుపాయాల కల్పన కోసం 12.5 కోట్ల రూపాయల నిధులు మంజూ రు చేయడం జరిగిందన్నారు. మంచినీటి చెరువులు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలందరిపైనా ఉందన్నారు. పట్టణంలో సమగ్ర అభివృద్ధి కోసం వాకింగ్‌ ట్రాక్‌, ఓపెన జిమ్‌లు, పార్కులు, రహదారులు, డివైడర్లు, డ్రైనేజీలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మనలు అడువాల లక్ష్మణ్‌ జ్యోతి, గిరి నాగభూషణం, గోలి శ్రీనివాస్‌, కమిషనర్‌ స్పందన, డీఈ ఆనంద్‌, మాజీ కౌన్సిలర్లు గట్టు సతీష్‌, పిట్ట ధర్మరాజు, బాలేశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:43 AM