Share News

పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:59 AM

ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు విద్యార్థులకు విద్య, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు.

పాఠశాలల్లో నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

ఎల్లారెడ్డిపేట, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ పాఠశాలల్లో అసంపూర్తిగా ఉన్న తరగతి గదుల నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు విద్యార్థులకు విద్య, రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌, రాగట్లపల్లి గ్రామాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను గురువారం ఆయన ఆకస్మీకంగా తని ఖీచేశారు. పాఠశాల పరిసరాలు, విద్యార్థుల హాజరు పట్టిక, మ ధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజనం గ్యాస్‌ సిలిండర్లపై తయారు చేయాలని పేర్కొన్నారు. తరగతి గదుల్లో కి వెళ్లి విద్యార్థుల ప్రగతిని పరిశీలించారు. ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అభ్యాసన సామర్థ్యాలతో కూడిన విద్యను బోధించానలి ఉపాధ్యాయులకు సూచించారు. ప్రతి రోజు అన్ని పాఠ్యాంశాలు చదివించడం, రాయించడం చేయాలని పేర్కొన్నారు. నారాయణపూర్‌ లో పాఠశాల ఎదుట ప్రాంతం అపరిశుభ్రంగా కనిపించడంతో ఇదేనా పారిశుద్ధ్యం అంటూ పంచాయతీ కార్యదర్శి జాఫర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మురుగు నీటి, తాగు నీటి సమస్యల తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాగట్లపల్లిలో పాఠశాల ప్రహారీ గోడ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తల్లిదండ్రులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు. దాంతో ప్రహారీ గోడను నిర్మించాలని సం బంధిత శాఖ అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కోతకు గురైన రహదారులకు మరమ్మతు పనులు చేసి ప్రజల ఇబ్బందులను తీర్చాలన్నారు. మండలంలోని బండలింగంపల్లి గ్రామ శివారులోని మానేరు వాగుపై ఉన్న వంతెన వద్ద కోతకు గురైన రోడ్డు ను పరిశీలించారు. వాగు పరిసరాలు, ఉధృతిపై ఆరా తీశారు. అప్రోచ్‌ రహదారి పనులను ప్రారంభించి పది రోజుల్లో పూర్తిచేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో వెంకటేశ్వ ర్లు, పంచాయతీరాజ్‌ శాఖ ఈఈ సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్‌ సుజాత, ఎంపీడీవో సత్తయ్య, పీఆర్‌ డీఈ శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, ఆయా శాఖల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 05 , 2025 | 12:59 AM