30 రోజుల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభించాలి
ABN , Publish Date - May 29 , 2025 | 12:25 AM
ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు 30 రోజులలోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లబ్దిదారులకు సూచించారు.
బోయినపల్లి, మే 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు 30 రోజులలోగా తప్పనిసరిగా ప్రారంభించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝ లబ్దిదారులకు సూచించారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ బోయిన్‌పల్లి మండలంలో ప్రభుత్వ పాఠశాల గ్రౌండ్‌లో రెండో విడత కింద 709 ఇందిరమ్మ ఇండ్ల మంజూరి ఉత్తర్వుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యంతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ బోయిన్‌పల్లి మండలం అనంతపల్లి గ్రామంలో పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకొని మొదటి విడత కింద 109 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయగా, 50 శాతంవరకు పూర్తయ్యాయని, ప్రభుత్వం వారికి చెల్లింపులు కూడా చేస్తుందన్నారు. రెండో విడత కింద మండల వ్యాప్తంగా 709 లబ్ధిదారులను పారదర్శకంగా అర్హులుగా ఎంపిక చేసి ఇందిరమ్మ ఇళ్ల ఉత్తర్వులు పంపిణీ చేస్తున్నామని, వీరు ఇంటి నిర్మాణం పనులు 30రోజులలోగా తప్పనిసరిగా ప్రారంభించాలన్నారు. 3 నెలల వ్యవధిలో ఇళ్ల నిర్మాణం పనులు పూర్తిచేసుకొని రానున్న పండుగలు నూతన గృహాల్లో జరుపుకోవాల ని సూచించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు 4 దశలలో 5 లక్షల రూపాయల ఆర్థికసహాయం అందుతుందన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం మాట్లాడుతూ బోయిన్‌పల్లి మండలంలో 709 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం సంతోషంగా ఉందన్నారు. ప్రజల హృదయాల్లో స్పష్టమైన ముద్ర వేసుకునేలా సిరిసిల్ల కలెక్టర్ పనితీరు ఉందని ఎమ్మెల్యే ప్రశంసించారు. మానవీయ కోణంతో పని చేస్తున్న కలెక్టర్‌కు ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. మిడ్ మానేరు బాధితులకు న్యాయం చేయ డం కోసం త్వరలో అదనంగా 1000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. మం డలంలో 4153 రైతులకు రూ36 కోట్ల 63 లక్షల రుణ మాఫీ పూర్తి చేశామని, గతంలో కేవలం 13కోట్ల మాత్రమే జరిగాయని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందు లు పడుతున్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక్కొక్క హామీ అమలు చేస్తు న్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లేష్ యాదవ్, పిఏసి చైర్ పర్సన్ వెంకట రామారావు, సెజ్ సంచాలకులు సుధాకర్, పిడి హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి వినోద్, ఎంపీడీవో జయశీల సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు సురేందర్ రెడ్డి రమణారెడ్డి సుధాకర్ మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.