రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర
ABN , Publish Date - Apr 11 , 2025 | 12:27 AM
సిరిసిల్ల పట్టణంలోని 13,15,27 వార్డుల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాం గ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించారు.

సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల పట్టణంలోని 13,15,27 వార్డుల్లో గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాం గ పరిరక్షణ పాదయాత్రలు నిర్వహించారు. వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండాలను ఏఐసీసీ కోఆర్డినేటర్ ఆవేజ్ ఆవిష్కరించారు. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నాయకులు పూలతో నివాళులర్పించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏఐసీసీ కో ఆర్డినేటర్ ఆవేజ్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, ప్రధాన కార్యదర్శి మ్యాన ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ప్రధాన కార్యదర్శి కోడం అరుణ, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, మాజీ కౌన్సిలర్ ఆకునూరి విజయనిర్మల బాలరాజు, వెంగళ లక్ష్మినర్సయ్య, కత్తెర దేవదాస్, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ వైస్‌చైర్మన్ నీలి రవీందర్, మాజీ డైరెక్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్, నాయకులు వైద్య శివప్రసాద్, కోడం శ్రీనివాస్, అన్నల్‌దాస్ భాను, కల్లూరి చందన, బూర్ల యాదగిరి, రాపెల్లి కళ్యాణ్, నక్క నర్సయ్య, రషీద్, కె రాజు తదితరులు పాల్గొన్నారు.