కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ABN , Publish Date - Aug 14 , 2025 | 11:36 PM
ఎన్నికల కమిషన్ బీజేపీతో చేతులు కలపడం వల్లనే దొంగ ఓట్లు సాధ్యమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఆగస్టు 14 (ఆంధ్రజ్యోతి) : ఎన్నికల కమిషన్ బీజేపీతో చేతులు కలపడం వల్లనే దొంగ ఓట్లు సాధ్యమైందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నేతన్న విగ్రహం నుంచి గాంధీచౌక్ వరకు ఓటు చోర్ గద్దె చోడ్ అనే నినాదంతో కొవ్వొ త్తుల ర్యాలీతో నిరసనలు తెలిపారు. ఈసందర్భంగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ప్రధాన మంత్రి నరేంద్రమోది నాయ కత్వంలో బీజేపీ ప్రభుత్వం ఓట్లను దొంగలిస్తూ గెలుస్తున్న వైనా న్ని సోనియాగాంఽధీ నాయకత్వంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహు ల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే ప్రజా పోరాటాలు చేస్తూ ముం దుకు వెల్తున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలకు ఓట్ల చోరీపై ఒక సినిమాల వీడియో రూపంలో చూపిస్తుంటే బీజేపీ ఈ రూప కంగా దొంగ ఓట్లతో గెలుస్తుందన్న భావన ప్రజలో వచ్చిందన్నారు. పార్లమెంట్‌లో ప్రశ్నించే పెద్దల గొంతుకలను నొక్కుతూ ఎంపీలను అరెస్టు చేస్తూ జైలుకు పంపే ప్రయత్నాని తప్పుపడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖార్గే, టీపీసీసీ మహేష్‌కుమార్‌గౌడ్ ఆదేశాల మేరకు కొవ్వొత్తుల ర్యాలీలతో నిరసనలు తెలిపామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయం జిల్లా చైర్మన్ నాగుల సత్యనారాయణ, మార్కెట్ కమి టీ చైర్‌పర్సన్ వెల్ముల స్వరూపతిరుపతిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షు డు చొప్పదండి ప్రకాష్, ప్రధానకార్యదర్శి మ్యాన ప్రసాద్, ఉపాధ్య క్షుడు బొప్ప దేవయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అకునూరి బాలరాజు, కాంగ్రెస్ మహిళ విభాగం జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, టీపీసీసీ కో ఆర్డెనేటర్ సంగీతం శ్రీనివాస్, పార్లమెంట్ కో ఆర్డనేటర్ కనమేని చక్రధర్‌రెడ్డి, మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.