కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:22 AM
భగత్‌నగర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం చింతకుంట బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందన్నారు.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్
భగత్‌నగర్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు చేసిన కామారెడ్డి డిక్లరేషన్‌ను అమలు చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం చింతకుంట బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికలకు బీఆర్‌ఎస్ సిద్ధంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక ఎన్నికలను నిర్వహించాలన్నారు. రైతులు పోసిన నార్లు ఎండిపోతన్నాయని, సాగు నీరందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎరువుల కొరత తీవ్రంగా ఉందన్నారు. రైతులకు సరిపడా పంట పొలాలకు సరిపోయేలా ఎరువులను తెప్పించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాలపై ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. చింతకుంటలో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్లపై తాము అధికారంలో ఉండగా, కాంగ్రెస్ నాయకులు రాద్ధాంతం చేశారన్నారు. ప్రస్తుతం వారు అధికారంలో ఉన్నారని, చింతకుంటలో నిర్మించిన 640 డబుల్ బెడ్ రూం ఇళ్లను వెంటనే అర్హులకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. హుజూరాబాద్‌లో దళితబంధువచ్చిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వడం లేదన్నారు. కరీంనగర్ నియోజక వర్గంలో ఒక్క ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. కలెక్టర్ చొరవ తీసుకుని అభివృద్ధి ఫలాలతో పాటు, సంక్షేమ ఫలాలను పేదలకు అందే విధంగాచర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ ఎమ్మెల్యేలు సతీష్‌రావు, రసమయిబాలకిషన్, సుంకెరవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, గ్రంథాలయ మాజీ చైర్మన్లు ఏనుగు రవీందర్‌రెడ్డి, పొన్నం అనిల్‌గౌడ్ పాల్గొన్నారు.
ఫ జర్నలిస్టులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలి
కరీంనగర్‌లోని జర్నలిస్టులందరికీ ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని మాజీ మంత్రి, కరీంనగర్ శాసన సభ్యుడు గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. గురువారం కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్, చింతకుంట గ్రామాల్లో జర్నలిస్టులకు కేటాయించిన ప్లాట్ల వద్దకు వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు బీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన జర్నలిస్టులందరికీ ఆడబిడ్డల పేరుతో పట్టాలు పంపిణీ చేశామన్నారు. పట్టాలపై ఆంక్షలు ఎత్తి వేసి వారు ఇళ్లు నిర్మించుకునే విధంగా ప్రభుత్వమే వారికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జర్నలిస్టులకు బీఆర్‌ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు.