ప్రజలకు సేవ చేసేది కాంగ్రెస్ పార్టీ..
ABN , Publish Date - Apr 30 , 2025 | 12:07 AM
వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనీ విలన్‌గా చిత్రీకరించాడు.. కాంగ్రెస్ పార్టీ విలన్ కాదు భారత ప్రజల సేవ చేసే పార్టీ అని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరు మాళ్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి) : వరంగల్ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీనీ విలన్‌గా చిత్రీకరించాడు.. కాంగ్రెస్ పార్టీ విలన్ కాదు భారత ప్రజల సేవ చేసే పార్టీ అని ఏఐసీసీ కార్యదర్శి విశ్వనాథన్ పెరు మాళ్ అన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం రాజన్న సిరి సిల్ల జిల్లా కేంద్రంలో జైభీమ్, జైబాపు, జైసంవిధాన్‌లో భాగంగా గాంధీ చౌక్‌లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను స్థానిక గాంధీచౌక్ వద్ద ఏఐసీసీ కార్యదర్శి విశ్వ నాథన్ పెరుమాళ్ జెండా ఊపి ప్రారంభించారు. పాదయాత్రలో మహాత్మ గాంధీ, బీఆర్ అంబేద్కర్ విగ్రహాలకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం లహరి ఫంక్షన్ హాల్‌లో ప్రభుత్వ విప్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అధ్యక్షతన కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ముఖ్య అతిథి ఏఐసీసీ కార్యద ర్శి విశ్వనాథన్ పెరుమాళ్ మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజవర్గంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రల్లో పాల్గొ న్నానని, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన పాదయాత్రలో 55 ఏండ్ల వయస్సులో కూడా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు 35 ఏళ్ల యువ కుడిగా పాదయాత్ర చేశాడని, అందుకే ముఖ్యమంత్రి గుర్తించి ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించారన్నారు. దేశ వ్యాప్తంగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ గ్రామీణ స్థాయి నుంచి నూతన కమిటీలు ఏర్పాటు చేయబోతుంద న్నారు. అందులో భాగంగానే తెలంగాణ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ జిల్లాలకు పీసీసీ పరిశీలకులను(అబ్జర్వర్లు) నియమించిందని, కష్టకాలం లో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్న వారిని గుర్తించి రిపోర్టును అబ్జర్వ ర్లు తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జికి అందజేస్తారన్నారు. మొన్నటి సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని విలన్‌గా, తనను హోరోగా చిత్రీకరించుకున్నాడని, కాంగ్రెస్‌లో విలన్స్, హీరోలు ఎవరూ లేరన్నారు. ప్రపంచంలో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్యం, సౌమ్యవాదం కలిగిన పార్టీ అన్నారు. పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒకే గూటి పక్షులని, దేశ సంపదను బీజేపీ, తెలంగాణ రాష్ట్ర సంపదను బీఆర్‌ఎస్ దోచుకుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది తెలంగాణ తల్లి సోనియాగాంధీతోనే అని ప్రజలు గుర్తించారన్నారు. దేశంలో బీజేపీ పాలనలో వ్యవస్థలన్ని ప్రమాదంలో ఉన్నాయని, వాటిని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జైభీమ్, జైబాపు, బైసంవిధాన్ అనే నినాదంతో భారత రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు చేస్తూ ప్రజలను చైతన్యవంతులను చేస్తోందన్నారు.
సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ వ్యతిరేకిస్తోంది..
- ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అమలుచేస్తున్న అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బీఆర్‌ఎస్ పార్టీ వ్యతిరేకిస్తోందని ప్రభుత్వ విప్, జిల్లా కాం గ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ అన్నారు. జైభీమ్, జైబాపు, జైసంవి ధాన్‌లో భాగంగా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలను జిల్లాలో విజయ వంతంగా కొనసాగిస్తున్న నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలి పారు. మే 4 నుంచి నియోజకవర్గం, బ్లాక్, మండల స్థాయిలో కూడా రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించాలని పీసీసీ పిలుపునిచ్చిందన్నారు. పార్టీలో బాధ్యతారహితంగా ప్రవర్తిస్తే చర్యలు ఉం టాయని హెచ్చరించారు. త్వరలో రాజన్న ఆలయం విస్తరణ పనులు ప్రారంభం అవుతాయన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయం చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గం ఇంచార్జి కేకే మహేందర్‌రెడ్డి, కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జి వెలిచాల రాజేందర్ రావు, పీసీసీ పరిశీలకులు ఫక్రుద్దీన్, కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, సిరిసిల్ల, వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చొప్ప దండి ప్రకాష్, చంద్రగిరి శ్రీనివాస్, జిల్లా మహిళ అధ్యక్షురాలు కాముని వనిత, మార్కెట్ కమిటి చైర్మన్లు, వివిధ మండాలాల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్, ఎస్సీ సెల్, బీసీ సెల్, చేనేత సెల్ అధ్యక్షులు, అనుబంధం సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల బాహాబాహి..
కాంగ్రెస్ కమిటీ విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా పరిశీలకుల (అబ్జ ర్వర్లు) ఎదుట కాంగ్రెస్ నాయకుల మధ్య విబేధాలు బయటపడ్డాయి. టీపీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతున్నా నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం లేదని ఆరోపించారు. దీంతో కార్యకర్తలు ఉమేష్‌రావు, కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. కాంగ్రెస్ నాయకులు బాహాబాహీకి దిగగా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నచ్చజెప్పడంతో గొడవ సద్దుమణిగింది.