తప్పుడు ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్
ABN , Publish Date - Mar 13 , 2025 | 12:56 AM
గత 14 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని వేములవాడ నియోజకవర్గం బీ ఆర్‌ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపిం చారు.

వేములవాడ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి) : గత 14 నెలలుగా ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండా తప్పుడు ఆరోపణలతో కాలం గడుపుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని వేములవాడ నియోజకవర్గం బీ ఆర్‌ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపిం చారు. బుధవారం ఆయన వేములవాడలోని తన నివా సంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లా డుతూ వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తీరును విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికా రంలోకి వచ్చి 14నెలలు గడుస్తున్నప్పటికీ నియోజకవ ర్గంలో ఒక్క రూపాయి పని కూడా చే యకుండా గత 10సంవత్సరాల కాలం లో బిఆర్‌ఎస్ హయాంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదంటూ తప్పుడు విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత పదేళ్ళ లో తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పేం దుకు తాము సిద్ధంగా ఉన్నామని, గత 14 నెలల్లో కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృధి పనులపై చర్చిం చేందుకు సిద్ధమా అని ప్రశ్నించారు. నియోజకవర్గ పరి ధిలో సాగునీటి ప్రాజెక్టులపై ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో సమగ్రంగా వివరించారు. గత 50ఏండ్ల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ చరిత్రలో జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తికాలేదని, 2014తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై బిఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టాక సీఎం కేసీఆర్ నా యకత్వంలో జిల్లాలోని అప్పర్ మానేర్, మిడ్ మానేర్, లోయర్ మానేర్‌లను పునరుద్ధరించి ఒక్క ప్రాజెక్టు కిం ద లక్ష ఎకరాల నీరందించేందుకు కృషి చేసినట్లు తెలి పారు. తమపై అసత్యప్రచారాలు మానుకొని నియో జకవర్గంలోని కలికోట సూరమ్మ చెరువు, మల్కపేట రిజర్వాయర్, అప్పర్‌మానేర్‌ల పెండింగ్ పనుల్ని పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని, రాజన్న ఆలయ అభి వృద్ధి చేయాలని, మిడ్‌మానేర్ నిర్వాసితుల సమస్యల ను పరిష్కరించాలని ఆయన కోరారు. రాజకీయపరమై న కారణాలతో చేస్తున్న తప్పుడు విమర్శలు మానుకుని ప్రజలకు, రైతాంగానికి అవసరమైన పనులు చేస్తే ఎ మ్మెల్యే ఆది శ్రీనివాస్‌ను తామే ఘనంగా సన్మానిస్తామ ని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి కరీం నగర్ జిల్లా మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, వేము లవాడ మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ రామతీర్థపు మాధ వి, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి, పలు వురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.