రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్న కాంగ్రెస్
ABN , Publish Date - Apr 19 , 2025 | 12:27 AM
భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అన్నారు.
ఎల్లారెడ్డిపేట, ఏప్రిల్ 18 (ఆంధ్రజ్యోతి): భారత రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పార్టీ కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి, సింగారం, కోరుట్లపేట గ్రామాల్లో స్థానిక నాయ కులతో కలిసి శుక్రవారం ఆయన పాదయాత్రను చేపట్టారు. గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నర్సయ్య, లక్ష్మారెడ్డి, రాంరెడ్డి, గౌస్, బాలయ్య, రవీందర్, దేవానందం, అంజిరెడ్డి, ఎల్లాగౌడ్, విజయ్‌రెడ్డి, బాలుయాదవ్, రమేశ్, దేవయ్య, హైమద్ తదితరులు పాల్గొన్నారు.