పేదల స్వంతింటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:38 AM
ఇల్లు నిర్మించు కోవాలనే పేద ప్రజల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ టౌన్, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): ఇల్లు నిర్మించు కోవాలనే పేద ప్రజల కలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చిందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ పట్టణంలోని 22వ వార్డులో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుల కడప పూజకు హాజరై వారికి చీర,సారెను అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు పేదల కల అన్నారు. ఎన్నో ఏళ్లుగా స్వంత ఇంటి కోసం పేదలు నిరీ క్షిస్తున్నారని, ప్రజా ప్రభుత్వంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ఇందిర మ్మ ఇండ్ల పట్టాలు అందించడంతో ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎతో ముందంజలో ఉందని, రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో ప్రవేశపెట్టడం రేవంత్‌రెడ్డి పనితీరుకు నిదర్శనమన్నారు. రాబోవు రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు ప్రజల ముందుకు రానున్నాయని, సంక్షేమ పథకాలు అర్హులకు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, వైస్‌చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు శ్రీనివాస్, వెంకటస్వామి ఉన్నారు.