డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ABN , Publish Date - May 22 , 2025 | 12:53 AM
తెలంగాణ రాష్ట్రంలో 17 నెలలుగా అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేని దయనీయమైన పరి స్థితులలో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 21 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రాష్ట్రంలో 17 నెలలుగా అధి కారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి చేయలేని దయనీయమైన పరి స్థితులలో డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు అన్నారు. బుధవారం సిరిసిల్ల పట్టణం ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు కాళేశ్వర్యం ఎత్తిపోతల పథకంలో మేడి గడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాంలోపాలు, అవకతవలపై విచారణకు రావాలంటూ జస్టిస్ పినాకి చంద్రఘెష్ కమిషన్ నోటీసులు పంపించడాన్ని ఖండిస్తున్నామన్నారు. దాని కాలపరిమితి పూర్తి అయిందని కేసీఆర్‌తో పాటు హరీష్‌రావు ఇతరులను ఎవరిని కూడా విచారణ చేసే పరిస్థితులు లేవని కమిష న్ రిపోర్టు పంపిస్తుందనే మాట చెప్పడం జరిగిందన్నారు. చెప్పిన ఒక్కరోజులోనే ప్రభుత్వం జీవో ఇచ్చి వాళ్లకు నోటీసులు ఇప్పించడంను ప్రజలు గమనించాల న్నారు. కమిషన్ చాలా మందిని విచారణ జరిపి సమాచారం తీసుకోవచ్చని కానీ దోషులుగా ఏ రకంగానెనా వీరిని చూపించాలని చిత్రీకరించాలని కుటిలమైన ఆలోచన ఈ ప్రభుత్వంకు ఉందని ఆరోపించారు. ఈ 17 నెలలకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని పూర్తి చేయలేదని, ఈ ప్రభుత్వంలో అంతా కరెప్షెన్ మంత్రులేనని ప్రజల్లో పేరుకు పోయిందన్నారు. ఒక మంత్రి మాట్లాడుతూ అంద రు మంత్రులు డబ్బులు తీసుకొని పని చేస్తున్నారని తాను డబ్బులు తీసుకోకుం డా పనిచేస్తున్నానని చెప్పడం ద్వారానే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తేటతెల్ల మైందన్నారు. సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కాళ్లేశ్వరం ప్రాజెక్టు ద్వారా కరువు లేకుండా ముందుకు తీసుకెళ్లాడని అన్నారు. కేసీఆర్‌ను దోషిగా నిరూపిం చాలని, ఆయన చేసిన పనులు కూడా తప్పని చెప్పడానికి మాత్రమే కుంగిన పిల్లర్లను ఈ ప్రభుత్వం వదిలేసిందని ఆరోపించారు. దీంతో రాష్ట్రంలో ఎన్ని పొలా లు ఎండిపోయాయి, ఎంత కరువు వచ్చిందో ప్రజలు గమనించాలన్నారు. గతం లో ఇంత దిగజారిన రాజకీయం ఎప్పుడు ఎవరు చేయలేదన్నారు. ప్రజలను పక్క దారి పట్టించాలని ఆలోచనతో ఈ కమీషన్లు, కమిటీలతో ఈ ప్రభుత్వం కాలయా పన చేస్తుందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. హుసేన్‌సాగర్‌ను ప్రక్షాలన చేసి ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌కు మరొక మార్గంలో నీటి తీసుకెళ్తామని చెప్ప డం జరిగిందని అది కేసీఆర్ కట్టిన కాళ్లేశ్వరం ప్రాజెక్టు ద్వారానే హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లాల్సి ఉంటుందని మరో మార్గం లేదన్నారు. ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్‌ను బదనాం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ ఎంపీపీ గజబీంకార్ రాజన్న, మాజీ కౌన్సిలర్ గుండ్లపెల్లి పూర్ణచందర్, నాయకుడు కుంభాల మల్లారెడ్డి పాల్గొన్నారు.