కాంగ్రెస్, బీజేపీ తీరుతో ప్రజలకు అన్యాయం
ABN , Publish Date - Aug 26 , 2025 | 12:14 AM
కాంగ్రెస్, బీజేపీ తీరుతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు.
మానకొండూర్, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్, బీజేపీ తీరుతో రాష్ట్ర ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు అన్నారు. మానకొండూర్‌లోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు అష్టకష్టాలు పడుతుంటే కాంగ్రెస్ అగ్ర నాయకులు జనహిత పాదయాత్రలు చేపట్టడడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ నాయకులు నిర్వహించింది జనహిత యాత్ర కాదని, జన క్షోభయాత్రగా అని ఎద్దేవా చేశారు. మీనాక్షి నటరాజన్ ప్రజా సమస్యలపై మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. మీనాక్షి నటరాజన్ సహా తెలంగాణ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడిన తీరు బాగా లేదని ఆయన అన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ తాల్లపల్లి శేఖర్‌గౌడ్, ఎరుకల శ్రీనివాస్, శాతరాజు యాదగిరి, ఆర్ వెంకట్‌స్వామి పాల్గొన్నారు.