అమెరికా యుద్ధోన్మాదాన్ని ఖండించండి
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:34 PM
ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు.
గణేశ్‌నగర్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై అమెరికా బాంబు దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో సీపీఎం, సీపీఐ, సీపీఐఎంఎల్ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ సామ్రాజ్యవాద ఆధిపత్యం కోసమే అమెరికా ఇరాన్ పై వైమానిక బాంబు దాడులకు పాల్పడిందన్నారు. ఈ యుద్ధాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఏర్పడతాయని, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. పశ్చిమాసియాపై ఆధిపత్యం చెలాయించడానికి అమెరికా ఈ దుశ్చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా నాయకుడు జిందం ప్రసాద్, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గుడికందుల సత్యం, గీట్ల ముకుందరెడ్డి, నాయకులు కిన్నెర మల్లమ్మ, యు శ్రీనివాస్, పైడిపల్లి రాజు, నాలపట్ల రాజు, బుచ్చన్నయాదవ్, మచ్చ రమేష్, ఆర్ వెంకటేష్ జి తిరుపతినాయక్, కనుక రాజు పాల్గొన్నారు.