వర్ష నష్టంపై సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలి
ABN , Publish Date - Oct 31 , 2025 | 12:39 AM
మొంథా తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టంపై జిల్లా అధికారులు సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజ లకు సేవ లను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల కలెక్టరేట్, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి) : మొంథా తుఫాన్ నేపథ్యంలో జరిగిన నష్టంపై జిల్లా అధికారులు సమగ్ర నివేదికలను సిద్ధం చేయాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజ లకు సేవ లను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌లో గురువారం జరిగిన వీడియోకాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి మంత్రులతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్‌తోపాటు జిల్లా అధి కారులతో మొంథా తుఫా న్ నష్టాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు మండలస్థాయి అధి కారిని ఇన్‌చార్జిలుగా నియమించాలని, ధాన్యం కొనుగోలు చేయడం, అవసరమైన గన్నీ బ్యాగులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో పెట్టుకో వడం, ఽధాన్యం తరలింపు అవసరమైతే స్థానికంగా ధాన్యం స్టోర్ చేయ డం వంటి పనులు చేపట్టాలన్నారు. ప్రతి రోజు ఽధాన్యం కొనుగోలు కేం ద్రాల నుంచి కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిస్థితులపై నివేదికలను అందించా లన్నారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూంను ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు ప్రభుత్వానికి చాలా కీలకమని దీనిపై కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచే యాలన్నారు. మొంఽథా తుఫాన్ వల్ల దెబ్బతిన్న రోడ్లపై వాహనాల రాక పోకలను నిలిపివేయాలన్నారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారుల సెలవులను రద్దు చేయాలని, ప్రతి అఽధికారి క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ వల్ల ప్రాణనష్టం జరుగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జీ కలెక్టర్ గరిమాఆగర్వాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వసతుల పరిశీలనకు ప్రత్యేక అధికారులు నియ మించాలని, రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు. రోడ్లు, వంతేనలు, కల్వర్టుల వద్ద అవసరమైన మరమ్మ తులు చేయించాలని అధికారులను అదేశించారు. ఈ వీడియో కాన్ఫరె న్స్‌లో సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్ బేగం, డీసీవో రామకృష్ణ, డీఐవో కిషోర్‌కుమార్, డీఐఈవో శ్రీనివాస్, సీపీ వో మల్లేశం తదితరులు పాల్గొన్నారు.