Share News

పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:50 AM

Completed reservation processస్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రెండు రోజులుగా ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేశారు.

పూర్తయిన రిజర్వేషన్ల ప్రక్రియ

- జడ్పీటీసీ స్థానాలు ఎస్సీలకు 3, బీసీలకు 6, జనరల్‌కు 4

- ఎంపీపీ స్థానాలు ఎస్సీలకు 4, బీసీలకు 5, జనరల్‌కు 4

- ఎంపీటీసీ స్థానాలు ఎస్సీలకు 26, ఎస్టీలకు 3, బీసీలకు 58, జనరల్‌కు 50 స్థానాలు

- సర్పంచ్‌ స్థానాలు ఎస్సీలకు 50, ఎస్టీలకు 5, బీసీలకు 110, జనరల్‌కు 98

- ఈ లెక్కలు అటు, ఇటుగా మారే అవకాశం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఆయా స్థానాల రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయ్యింది. రెండు రోజులుగా ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా అధికార యంత్రాంగం రిజర్వేషన్లు ఖరారు చేశారు. జాబితాను బుధవారం ప్రభుత్వానికి పంపించనున్నట్లు సమా చారం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీల జనాభాను తీసుకోగా, బీసీల కోసం 2014లో చేపట్టిన కులగణన లెక్కల ప్రకారం రిజర్వేషన్లు ఖరారు చేశా రు. రెండు రోజుల నుంచి కలెక్టర్‌ సమక్షంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌, పెద్దపల్లి, మంథని ఆర్‌డీ వోలు, జడ్పీ సీఈవో, డీపీవో, ఎంపీవోలు, ఇతర సిబ్బం ది కలెక్టర్‌ కార్యాలయంలోనే రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టారు. 2019లో జరిగిన గ్రామ పంచాయతీ, మం డల, జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో రిజర్వు అయిన కేట గిరీలు రొటేషన్‌ ప్రకారం మారనున్నాయి. రామగుం డం మున్సిపల్‌ కార్పొరేషన్‌, పెద్దపల్లి, మంథని, సుల్తా నాబాద్‌ మున్సిపాలిటీలు మినహా గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం జనాభా 4,91,651 మంది ఉన్నారు. ఇందులో ఎస్సీ జనాభా 94,104 మంది, ఎస్టీ జనాభా 10,115 మంది ఉన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాల కు ఆయా మండలాల జనాభా ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు పోనూ మిగతా స్థానాలను జన రల్‌గా చూపెట్టనున్నారు. వార్డు సభ్యుల స్థానాలను గ్రామ జనాభా ఆధారంగా రిజర్వు చేశారు. ఇందులో 50శాతం సీట్లు మహిళలకు డ్రా తీసి కేటాయించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలకు ఆయా స్థానా ల్లో 19.14 శాతం, ఎస్టీలకు 2.05 శాతం, బీసీలకు 42 శాతం, జనరల్‌కు 36.80 శాతం సీట్లు కేటాయించారు.

ఫ బీసీలకు జడ్పీటీసీ 6, ఎంపీపీ 5 స్థానాలు..

జిల్లాలో జిల్లా, మండల పరిషత్‌ స్థానాలు 13 ఉన్నా యి. గత రిజర్వేషన్ల అంచనాల ప్రకారం జడ్పీటీసీ సా ్థనాల్లో 3 ఎస్సీలకు, 6 బీసీలకు, 4 జనరల్‌కు, ఇందులో 6 స్థానాలు మహిళలకు కేటాయించారని సమాచారం. ఇందులో పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలు ఎస్సీలకు కేటాయించారని తెలుస్తున్నది. బీసీలకు కాల్వశ్రీరాంపూర్‌, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, రామగిరి, అంతర్గాం, ఎలిగేడు మం డలాలు కేటాయించారని తెలుస్తున్నది. జనరల్‌కు మంథని, ఓదెల, కమాన్‌ పూర్‌, ముత్తారం మండలాలు కేటాయించారని సమాచారం. అలాగే ఎంపీపీ స్థానాల్లో 4 స్థానాలు ఎస్సీలకు, 5 స్థానాలు బీసీలకు, 4 స్థానాలకు జనరల్‌కు, ఇందులో మహిళలకు 5 స్థానాలు కేటాయించారని సమాచారం. ఎస్సీలకు ఎలిగేడు, జూలపల్లి, ధర్మారం, పాలకుర్తి మండలాలు, బీసీలకు మంథని, అంతర్గాం, సుల్తానాబాద్‌, రామగిరి, కాల్వశ్రీరాంపూర్‌, జనరల్‌కు పెద్దపల్లి, కమాన్‌పూర్‌, ముత్తారం, ఓదెల మండలాలను కేటాయించినట్లు ప్రచారం జరుగుతున్నది. 2019లో జరిగిన ఎన్నికల ప్రకారం జడ్పీటీసీ స్థానాల్లో ఎస్సీలకు 3 స్థానాలు కేటాయించారు. ఇందులో అంతర్గాం, ఎలిగేడు, మంథని స్థానాలు దక్కాయి. బీసీలకు 3 స్థానాల్లో ఓదెల, కమాన్‌పూర్‌, ముత్తారం మండలాలకు కేటా యించారు. జనరల్‌కు 7 స్థానాల్లో కాల్వశ్రీరాంపూర్‌, రామగిరి, జూలపల్లి, పెద్దపల్లి, పాలకుర్తి, ధర్మారం, సుల్తానాబాద్‌ మండలాలకు కేటాయించారు. ఎంపీపీ స్థానాల్లో ఎస్సీలకు మంథని, అంతర్గాం మండలాలు, బీసీలకు ముత్తారం, కమాన్‌పూర్‌, పెద్దపల్లి, రామగిరి, ఓదెల మండలాలు, జనరల్‌కు సుల్తానాబాద్‌, ధర్మారం, జూలపల్లి, పాలకుర్తి, జూలపల్లి మండలాలు కేటాయించారు.

ఫ బీసీలకు 110 సర్పంచ్‌ స్థానాలు..

జిల్లాలో 263 గ్రామ పంచాయతీలు ఉండగా, ఇందులో ఎస్సీలకు 50 స్థానాలు, ఎస్టీలకు 5 స్థానాలు, బీసీలకు 110 స్థానాలు, జనరల్‌కు 98 స్థానా లను రిజర్వు చేసినట్లు సమాచారం. ఎంపీటీసీ స్థానాలు 137 ఉండగా, ఎస్సీ లకు 26 స్థానాలు, ఎస్టీలకు 3 స్థానాలు, బీసీలకు 58 స్థానాలు, జనరల్‌కు 50 స్థానాలు కేటాయించారని తెలుస్తున్నది. అటు, ఇటుగా ఈ సంఖ్య మారే అవకాశాలు ఉన్నాయి.

Updated Date - Sep 24 , 2025 | 12:51 AM