Share News

పెండింగ్‌ పనులను పూర్తి చేయండి

ABN , Publish Date - Aug 13 , 2025 | 12:03 AM

నగరపాలక సంస్థ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ రఫుల్‌ దేశాయ్‌తో నగర సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు.

పెండింగ్‌ పనులను పూర్తి చేయండి
v

కరీంనగర్‌ టౌన్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. మంగళవారం ఆయన మున్సిపల్‌ కమిషనర్‌ రఫుల్‌ దేశాయ్‌తో నగర సమస్యలు, అభివృద్ధి పనులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ నగరంలో వ పలు అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉన్నాయని, దీంతో నగర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మంత్రులు సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారే కానీ పట్టించుకోవడం లేదన్నారు. కమిషనర్‌గా 10 కోట్ల రూపాయల వరకు అవసరమైన పనులను చేపట్టేందుకు అధికారం ఉంటుందని, వాటితో అత్యవసరమైన పనులను పూర్తి చేయాలని కమిషనర్‌కు సూచించారు. వరద కాల్వల్లోని పూడిక తీయకపోవడంతో కొద్దిపాటి వర్షానికే రోడ్లు జలమయం అవుతున్నాయన్నారు. వరద కాలువల్లోని పూడిక తీసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరి శంకర్‌, మాజీ కార్పొరేటర్లు బాల రమణారావు, గందే మాధవి పాల్గొన్నారు.

Updated Date - Aug 13 , 2025 | 12:03 AM