యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం
ABN , Publish Date - Jun 22 , 2025 | 12:41 AM
యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నా రు.
సిరిసిల్ల క్రైం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి) : యోగాసనాలతో సంపూర్ణ ఆరోగ్యం సాధించవచ్చని జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. నీరజ అన్నా రు. శనివారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవా న్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు యోగాపై శ్రద్ధ కనబరిచి మానసిక, శారీరక ఉల్లాసాన్ని పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జిలు రాధిక జై స్వాల్, లక్ష్మణాచారి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రవీణ్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి కె. సృజన, రెండవ అదనపుజూనియర్ సివిల్ జడ్జి గడ్డం మేఘన, అడిషనల్ పిపి పెంట శ్రీనివాస్, బార్ అసోసియే షన్ అధ్యక్షులు జూపల్లి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వెంకటి, సీని యర్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు.