Share News

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Oct 11 , 2025 | 12:57 AM

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మనం పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పోషణ మాసంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కోతిరాంపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభ, విద్యార్థులతో ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించారు.

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం
విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌ పమేలాసత్పతి

పోషకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం

- శుక్రవారం సభలో కలెక్టర్‌ పమేలాసత్పతి

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): మనం పోషకాలతో కూడిన ఆహారం తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. పోషణ మాసంలో భాగంగా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కోతిరాంపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం సభ, విద్యార్థులతో ఫుడ్‌ ఫెస్టివల్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన వంటకాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషకాహారంపై అవగాహన పెంచుకొని వంట చేయాలని మహిళలకు సూచించారు. మనం తినే ఆహారం ద్వారా అందే పోషకాలను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. అన్నం తక్కువ, కూరలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. లింగ వివక్ష చూపకుండా పిల్లలకు ఇంటి పనులు, వంట పనులతో పాటు ఆర్యోగకర ఆహారం తయారు చేసే విధానం నేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు. పాలిచ్చే తల్లులు తప్పనిసరిగా ఐరన్‌, కాల్షియం మాత్రలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఐరన్‌, కాల్షియం మాత్రలు ఉచితంగా ఇస్తారని, 30 ఏళ్లు దాటిన మహిళలు ఆరునెలలకొకసారి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటూ అవసరమైన మాత్రలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఫెస్టివల్‌లో పాల్గొన్న విద్యార్థులకు నేను సైతం ఎన్జీవో ఆధ్వర్యంలో బహుమతులను అందించారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు.

కలెక్టర్‌ పాలనను, జిల్లాలో ప్రవేశపెట్టిన కార్యక్రమాలను వివరిస్తూ పాఠశాల హెచ్‌ఎం ఆలపించిన పాట అందరిని ఆకట్టుకు న్నది. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌వో వెంకటరమణ, సీడీపీవో సబిత, మెప్మా పీడీ స్వరూపరాణి, వైద్యాధికారి సనా, ఎన్జీవో ప్రతినిధి తదితరులు పాల్గొన్నారు.

ఆధార్‌కార్డు, పాన్‌కార్డు ఇచ్చి బ్యాంకు ఖాతాలను కొనసాగించవచ్చు

కరీంనగర్‌ టౌన్‌ : ఎవరైనా పదేళ్లు, ఆపై కాలం బ్యాంకు ఖాతాల్లో నగదు మొత్తం ఉంచి మరిచిపోయిన వారు బ్యాంకుకు వచ్చి ఆధార్‌కార్డు, పాన్‌కార్డు జిరాక్సు కాపీ ఇచ్చి వారి ఖాతాలను మళ్లీ కొనసాగించుకోవచ్చని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌ సమావేశమందిరంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ గుగూల్‌లో ఉద్గం పోర్టల్‌ రిజిస్టర్‌ అయి వివరాలు తెలుసుకోవచ్చని చెప్పారు. ఖాతాదారుల గుర్తింపుతో ఖాతాల నిర్వహణకు మద్దతు ఇవ్వాలని అన్ని బ్యాంకర్లను కలెక్టర్‌ ఆదేశించారు. ఈ సమావేశంలో లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ ఆంజనేయులు, డీఆర్‌వో వెంకటేశ్వర్లు, ఏవో సుధాకర్‌, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2025 | 12:57 AM