అవార్డు గ్రహీతలను అభినందించిన కలెక్టర్
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:58 AM
ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య సభ్యులు ఆత్మనిర్భర్ సంఘాతన్ అవార్డును తీసుకోవడం హర్షణీయమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు.
సిరిసిల్ల కలెక్టరేట్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి) : ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య సభ్యులు ఆత్మనిర్భర్ సంఘాతన్ అవార్డును తీసుకోవడం హర్షణీయమని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా అన్నారు. అవార్డును ఈనెల 14న కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సహా యమంత్రి పెన్మసాని చంద్రశేఖర్‌ల నుంచి ఇల్లంతకుంట మండల అదర్శ సమాఖ్యసభ్యులు స్వీకరించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కలెక్టర్ చాం బర్‌లో ఇల్లంతకుంట మండల ఆదర్శ సమాఖ్య సభ్యులు జిల్లా గ్రామీణా భివృద్ధి అధికారి శేషాద్రి, కలెక్టర్ సందీప్‌కుమార్ ఝాను మార్యాదపూర్వ కంగా కలిశారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇల్లంతకుంట మం డల అదర్శ మహిళా సమాఖ్య బ్యాంక్ రుణాల అందజేత, రికవరీ, క్రమం తప్పకుండా సమావేశాల నిర్వహణ, సామాజికఅవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుండడం హర్షణీయమన్నారు. మహిళా సంఘాలకు ఇలాగే సేవ లందిస్తూ మహిళలందరు ఆర్థికంగా రాణించేలా సహాయం అందించాలని కోరారు. కార్యక్రమంలో అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు.