Share News

సీఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు గొప్ప వరం

ABN , Publish Date - Jul 22 , 2025 | 12:38 AM

ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు గొప్ప వరమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్యె ల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

సీఎంఆర్‌ఎఫ్‌ పథకం పేదలకు గొప్ప వరం

రుద్రంగి, జూలై 21 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం పేదలకు గొప్ప వరమని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్యె ల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణంలో సొమవారం 11మంది లబ్ధిదారులకు రూ.4లక్షల వలువగల సీఎంఆర్‌ఎప్‌ చెక్కులను లబ్ధిదారులకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మెడికల్‌ హబ్‌ గా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీ వ్‌ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 10లక్షలకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ చెలుకల తిరుపతి, కాం గ్రెస్‌ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు సామ మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీ టీసీ గట్ల మీనయ్య, మాజీ సర్పంచ్‌ తర్రె ప్రభలత మనో హర్‌, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, గండి నారాయణ, మాడిశెట్టి అభిలాష్‌, కెసిరెడ్డి నర్సరెడ్డి, తర్రె లింగం, ఇప్ప మహేష్‌, బైరి గంగమల్లయ్య, పల్లి గంగా ధర్‌, ఎర్రం రాజలింగం, సూర యాదయ్య, గండి ఆశోక్‌, పూదరి మహిపాల్‌, గుగ్గిళ్ల వేంకటేశం, దయ్యాల శ్రీనివాస్‌, చెలుకల శ్రీకాంత్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 22 , 2025 | 12:38 AM