మహిళలకు సీఎం క్షమాపణ చెప్పాలి
ABN , Publish Date - Sep 28 , 2025 | 11:59 PM
మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను పంపిణీ చేయక పోవడాన్ని నిరసిస్తూ ఆదివారం తెలంగాణ చౌక్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి ప్రభు త్వం ఇచ్చిన హామీలను అమలు చేయ కుండా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసింద న్నారు. అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళలకు 2,500 రూపాయలతోపాటు కల్యాణలక్ష్మి పథకంలో తులం బంగారం, గ్యాస్ సబ్సిడీ, రైతుబంధు, ఎరువులు ఇలా అన్ని విభాగాల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫల మైందని ఆరోపించారు. స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో తెలంగాణ ప్రజలు సుఖసంతో షాలతో ఉన్నారని, ఏటా బతుకమ్మ పండుగకు మహిళ లందరికీ చీరలను కానుకగా ఇచ్చారని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే తగిన గుణ పాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, మాజీ కార్పొరేటర్లు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.