Share News

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం..

ABN , Publish Date - Dec 04 , 2025 | 01:20 AM

హిందూ దేవుళ్లపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ అన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం..

సిరిసిల్ల రూరల్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): హిందూ దేవుళ్లపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బుధవారం బీజేపీ పట్టణకమిటీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హిందువు దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నాయకులు నల్లబ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ మాట్లాడుతూ హిందు దేవుళ్లను అవమానించే ధైర్యం ఎవరికి ఉండకూడదని అన్నారు. గతం సిరిసిల్ల ఎమ్మెల్యే సైతం హిందూ దేవుళ్లను అవమానించి చివరికి తన పార్టీ కార్యాలయంలోనే హనుమాన్‌ దీక్షదారులతో కలిసి భజన చేసి తానుచేసిన తప్పు లను ఒప్పుకున్నారని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడిన వారిపై బీజేపీ వదిలిపెట్టిందన్నారు. సీఎం స్థాయిలో ఉండి కూడా రేవంత్‌రెడ్డి హిందువు దేవుళ్లపై అనుచిత వాఖ్యాలు చేయడం అర్హతలేనిదన్నా రు. ఇప్పటికైనా సీఎం హిందూ దేవుళ్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు మ్యాన రాంప్రసాద్‌, మాజీకౌన్సిలర్‌ గుడురి భాస్కర్‌, పట్టణ ఉపాధ్యక్షులు అంకా రపు రాజు, మోర శ్రీహరి, మేరుగు శ్రీనివాస్‌, కొండ నరేష్‌, మోర రవి, చొప్ప దండి శ్రీనివాస్‌, దూడం సురేష్‌, సూరం వినయ్‌, చొక్కి శ్రీనివాస్‌, రచ్చ రాహూల్‌, పల్లి కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 04 , 2025 | 01:20 AM