ఘనంగా సీఎం రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:53 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదిన వేడుకులను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శనివారం పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి దేవాలయంలో రుద్రాభిషేకం చేశారు. టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ ఆధ్వ ర్యంలో స్థానిక గాంధీచౌక్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ ఉపాధ్యక్షుడు బొప్ప దేవయ్య, చేనేత సెల్ జిల్లా అధ్యక్షుడు గోనె ఎల్లప్ప, సిరిసిల్ల అర్బన్ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ నీలి రవీందర్, మాజీ డైరెక్టర్ నేరెళ్ళ శ్రీకాంత్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ వెంగళ లక్ష్మీనర్స య్య, రాగుల జగన్, నాయకులు కోడం అమర్నాథ్, గోలి వెంకటరమణ, గుండ్లపెల్లి గౌతమ్, రాపెల్లి కల్యాణ్ తదితరులు పాల్గొన్నారు.