పాఠశాలలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలి
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:33 AM
పాఠశాలలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపరిశీలకుడు రంగనాథ్ సూచించారు.
ఇల్లంతకుంట, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): పాఠశాలలో స్వచ్ఛతకు ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్రపరిశీలకుడు రంగనాథ్ సూచించారు. మండలంలోని వెల్జీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్వచ్ఛహరిత విద్యాలయంగా ఎంపికకాగా రాష్ట్రపరిశీలకుడు మంగళవారం పరిశీలించారు. ఈసందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో వెల్జీపూర్ పాఠశాల ఎంపిక కావడం అభినందనీయం అన్నారు. పాఠశాలలో తాగునీరు అందుబాటులో ఉండాలని, మరుగుదొడ్ల పరిశుభ్రంగా ఉండటం, మొక్కలు నాటడం తదితర అంశాల ఆధారంగా ఎంపికచేయడం జరిగిందన్నారు. మెరుగైన పాఠశాలలను రాష్ట్రస్థాయికి ఎంపికచేయాలనే లక్ష్యంతో పాఠశాలను సందర్శించామని తెలిపారు. పాఠశాలలో ఉన్న వసతుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎకోక్లబ్ కోఆర్డినేటర్ అయ్యన్నగారి హరికృష్ణారెడ్డి, ఉపాధ్యాయులు అనురాధ, అన్నపూర్ణ తదితరులు ఉన్నారు.