చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:05 AM
జిల్లాలోని చిన్న పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు.
సిరిసిల్ల టౌన్, జూలై 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని చిన్న పిల్లలందరికి వ్యాధి నిరోధక టీకాలు క్రమం తప్పకుండా వేయించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రజిత అన్నారు. గురువారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్య అధికారులు, పర్య వేక్షకులతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత సమావేశం నిర్వహిం చారు. జాతీయ కార్యక్రమాలపై సాధించిన ప్రగతిపై ప్రతి పీఎస్ వారిగా సమీ క్షించారు. ఈ సందర్భంగా డాక్టర్ రజిత మాట్లాడుతూ కాలానుగుణంగా వచ్చే వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశాలున్నాయని అన్నారు. వ్యాధులు ప్రబల కుండా ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రై డే కార్యక్రమాలను తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. అదే విధంగా గర్భవతులైన మహిళల పేర్లను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సూచించారు. ఈ సమావేశం లో ప్రోగ్రాం ఎంహెచ్‌ఎన్ డాక్టర్ ఆల్ర్ఫేడ్, వైద్యాధికారులు సంపత్, రామకృష్ణ, అనిత, సిబ్బంది పాల్గొన్నారు.