Share News

చిన్నారులను సొంత పిల్లలుగా చూసుకోవాలి

ABN , Publish Date - Nov 11 , 2025 | 11:57 PM

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాలని స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే సిబ్బందిని ఆదేశించారు.

చిన్నారులను సొంత పిల్లలుగా చూసుకోవాలి

తిమ్మాపూర్‌, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులను తమ సొంత పిల్లలుగా చూసుకోవాలని స్థానిక సంస్ధల అదనపు కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే సిబ్బందిని ఆదేశించారు. మండలంలోని రామకృష్ణకాలనీ అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్‌ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారుల బరువు, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రీ స్కూల్‌ పిల్లలతో ఆమె మాట్లాడారు. ప్రీ స్కూల్‌ యాక్టివిటీని పరిశీలించారు. ఈ సందర్బంగా అశ్విని తానాజీ వాఖడే మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో అంగన్‌వాడీ కేంద్రాలను తయారు చేయాలన్నారు. గ్రామంలో పారిశుధ్య పనులను పకడ్బందీగా నిర్వహించాలని, మురుగు కాలువల్లో ఎప్పటికప్పుడు చెత్తాచెదారం తొలగించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకోవాలనీ అధికారులను అదనపు కలెక్టర్‌ అదేశించారు.

Updated Date - Nov 11 , 2025 | 11:58 PM