ముఖ్యమంత్రి సహాయనిధి పథకం పేదలకు వరం
ABN , Publish Date - Sep 25 , 2025 | 12:09 AM
ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
కోనరావుపేట, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరం లాంటిదని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. కోనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలో బుధ వారం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. వైద్యారోగ్య రంగంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతి, ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా మారిందని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టగానే రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ.10లక్షలకు పెంచి ప్రజా ఆరోగ్య భద్రతపై ప్రభుత్వాని కున్న చిత్తశుద్ధిని చాటుకున్నారని తెలిపారు. మన ప్రాంతంలో వివిధ ఆరో గ్య సమస్యలతో చికిత్స తీసుకున్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా, ఎల్‌వోసీల ద్వారా ఇప్పటివరకు 20 కోట్లపై చిలుకు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. పేదలకు వైద్యపరంగా ఎలాంటి ఇబ్బందు లు తలెత్తకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10 సంవత్స రాలలో 400 కోట్లు పంపిణీ చేస్తే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటివరకు 800 కోట్ల మేర లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరిగిం దన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, చేపూరి గంగాధర్, మండల అధ్యక్షుడు ఫిరోజ్ పాషా, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నాయిని ప్రభాకర్ రెడ్డి, వెంగలి వెంకన్న, శ్రీనివాస్ రెడ్డి, బాల్య నాయక్, కాంగ్రెస్ నాయకులు బాల్ రెడ్డి, ఉప్పుల గంగయ్య, సంజీవ్, పెంతల శ్రీని వాస్, మానుక సత్యం, నాగండ్ల భూమేష్, సదానందం పాల్గొన్నారు.