వేములవాడ రాజన్నపై ముఖ్యమంత్రికి ప్రత్యేక శ్రద్ధ
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:45 PM
వేములవాడ రాజ రాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధిపైన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ కల్చరల్, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజ రాజేశ్వర స్వామివారి ఆలయ అభివృద్ధిపైన సీఎం రేవంత్‌రెడ్డికి ప్రత్యేక శ్రద్ధ ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. మూలవాగు బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం వరకు గల ప్రధాన రోడ్డు, డ్రైనేజీ, ఫుట్‌పాత్ నిర్మాణానికి రూ.6.50కోట్ల పనులకు ఆదివారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బీ గితేతో కిలిసి శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ పట్టణ వాసుల తో పాటుగా రాష్ట్రం, ఇతర రాష్ట్రాల భక్తులు, ప్రజలు 54ఏళ్లుగా ఎదురు చూస్తున్న మూలవాగు నుంచి శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. 80ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ అమలులోకి తీసుకువచ్చామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సారథ్యం లో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడగానే ఆలయ అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రభుత్వం ఏర్పడిన మొదటి మాసంలోనే వీటీడీఏ సమావేశం ఏర్పాటు చేసి మళ్లీ వెళ్లిపో యిన రూ.20 కోట్ల నిధులను తిరిగి తెప్పించి బద్ది పోచమ్మ ఆలయ అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించామని గుర్తు చేశారు. రోడ్డు వెడల్పు సమయంలో కొందరు నాయకులు వచ్చి అటుఇటు నడిచి పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో చెప్పాలని ప్రకటనలు చేశారని, ఏది ఎప్పుడు చేయాలో తమకు తెలుసని స్పష్టం చేశారు. ఒక ప్రణాళిక ప్రకారం ముందకు వెళ్తున్నామని వివరించారు. భూ నిర్వాసితుల కోసం రూ.47 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి కలెక్టర్ ఖాతాలో జమ చేసి పనులు ప్రారంభం చేశామని తెలిపారు. రోడ్డు వెడల్పులో భూములు కోల్పోయిన నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని పేర్కొన్నారు. వారిని ఎల్లవేళలా గుర్తు చేసుకుంటూ వారికి 2013 భూ సేకరణ చట్టం ద్వారా నష్టపరిహారం చెల్లించామని తెలిపారు. 2014లో రాజన్న ఆలయం ఎట్లా ఉందో ఇప్పటికి అలానే ఉందని, గత ప్రభు త్వం చేసింది ఏమిలేదన్నారు. కానీ ఎన్నికల్లో ఎలాంటి హామీ ఇవ్వకుం డా ఇప్పటివరకు రూ.150కోట్లు కేటాయించామని వివరించారు. పట్ట ణం, రాజన్న ఆలయం రెండు కళ్లుగా భావించి అభివృద్ధి చేస్తామని, పట్టణాన్ని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ఆల యాన్ని అభివృద్ధి పథంలో తీసుకోవానికి ప్రజాప్రభుత్వం రూ.150 కోట్లు బడ్జెట్‌లో కేటాయించామని తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధి తన ఎజెండా కాదని, ఇది సమస్త రాజన్న భక్తుల ఎజెండా అని వివ రించారు. గత సంవత్సరం నవంబరు 20న సీఎం రేవంత్‌రెడ్డి 8మంది మంత్రుల చేతుల మీదుగా రూ.1000కోట్లతో అభివృద్ధి పనులకు శంకు స్థాపన చేశామని గుర్తు చేశారు. రోడ్డుకు ఇరువైపులా డ్రెనేజీ నిర్మాణం తోపాటు ఆధునాతన పద్ధతుల్లో లైటింగ్ సిస్టం కూడా ఏర్పాటు చేస్తా మని, జిల్లా యంత్రాంగం, కలెక్టర్ సందీప్‌కుమార్ నేతృత్వంలో అధికా రయంత్రాంగం పనులను పర్యవేక్షిస్తున్నారన్నారు. త్వరలోనే రూ.76 కోట్లతో ఆలయ మొదటి దశ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నా మని, ఇప్పటికే అగ్రిమెంట్లు పూర్తి అయి నమూనాలు త్వరలోనే రాను న్నాయని వెల్లడించారు. రూ.35 కోట్లతో అన్నదాన సత్రం నిర్మాణానికి టెండర్లు పూర్తయిందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా, ఎస్పీ మహేష్ బీ గితే, ఈవో రాధాబాయి, కమిషనర్ అన్వేష్, మార్కెట్ కమిటీ చైర్మన్‌లు రాజు, చెలుకల తిరుపతి, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్‌తో పాటు కాం గ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.