Share News

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..

ABN , Publish Date - Sep 27 , 2025 | 01:54 AM

తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ తెగువ, పౌరుషాన్ని ప్రదర్శించారని, ఆమె జీ వితం సూ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసనభ్యులు ఆది శ్రీనివాస్‌ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో మండల రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఐలమ్మ జయంతి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు.

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం..

కోనరావుపేట, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ సాయుధ పోరాటంలో చాకలి ఐలమ్మ తెగువ, పౌరుషాన్ని ప్రదర్శించారని, ఆమె జీ వితం సూ రాష్ట్ర ప్రభుత్వ విప్‌ వేములవాడ శాసనభ్యులు ఆది శ్రీనివాస్‌ అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా కోనరావుపేట మండల కేంద్రంలో మండల రజక సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిం చిన ఐలమ్మ జయంతి వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ము ఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కచ్చకాయల ఎల్లయ్య, కేతిరె డ్డి జగన్మోహన్‌రెడ్డి, మండల అధ్యక్షుడు ఫిరోజ్‌పాషా, పాక్స్‌ చైర్మన్‌ బండ నర్సయ్య, చందనగిరి గోపాల్‌, గొట్టే రుక్మిణి, రమేష్‌ రెడ్డి, లింబయ్య, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. సుద్దాలలో చాకలి ఐలమ్మ విగ్రహానికి బీఆర్‌ఎస్‌ వేములవాడ నియోజకవర్గ ఇన్‌చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారా వు పూలమాలవేసి నివాళులర్పించారు. బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మల్యాల దేవయ్య, కచ్చకాయల మహేష్‌, సుమన్‌, ప్రదీప్‌, అన్వేష్‌, అభి, సంతోష్‌, గోపు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

ఫ సిరిసిల్ల టౌన్‌, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ భవన్‌లో ఘనంగా జరగాయి. ముందుగా బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగ య్య, రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూల తో నివాళులర్పించారు. గ్రంథాలయం జిల్లా మాజీ చైర్మన్‌ ఆకునూరి శం కరయ్య, మాజీ కౌన్సిలర్లు గుండ్లపెల్లి పూర్ణచందర్‌, దార్ల సందీప్‌, రిక్కు మల్ల సంపత్‌కుమార్‌, సిరిసిల్ల అర్బన్‌ బ్యాంక్‌ మాజీ డైరెక్టర్‌ అడిచర్ల సాయి, జిల్లా నాయకుడు కుంభాల మల్లారెడ్డి, కొండ శంకర్‌ పాల్గొన్నారు.

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా మానేరు తీరాన ఉన్న చాకలి ఐ లమ్మ విగ్రహానికి కాంగ్రెస్‌, సీపీఐ, సీపీఎం, రజక సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు చొప్ప దండి ప్రకాష్‌, సీపీఎం జిల్లాకార్యదర్శి మూషం రమేష్‌, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఎల్లారెడ్డి,కార్యదర్శి కోడం రమేష్‌, పీసీసీ మాజీ కార్యదర్శి గడ్డం నర్సయ్య, ముదిరాజ్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు చొక్కాల రాము, దళిత నా యకుడు కంసాల మల్లేశం, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

ఫ ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రా లతో పాటు వెంకటాపూర్‌, అల్మాస్‌పూర్‌, రాచర్లబొప్పాపూర్‌ తదితర గ్రా మాల్లో రజక సంఘాల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట, వెంకటాపూర్‌, అల్మా స్‌పూర్‌ గ్రామాల్లోని చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ప్యాక్స్‌ చైర్మన్‌ కృష్ణారెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ మల్లేశం, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు నర్సయ్య, నాయకులు లక్ష్మారెడ్డి, గౌస్‌, వెంకట్‌రెడ్డి, రాంరెడ్డి, నర్సింలు, సుభాష్‌, దేవయ్య, రాజుకుమార్‌, శ్రీనివాస్‌, అరుణ్‌కుమార్‌, రవి, సంజీవ్‌, నగేశ్‌, దినాకర్‌, అంజయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

ఫ ఇల్లంతకుంట : మండలంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇల్లంతకుంట, పెద్దలింగాపూర్‌ గ్రామాలలో శుక్రవారం చాకలి ఐలమ్మ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మాజీ సర్పంచ్‌ గొడిశెల జితేందర్‌గౌడ్‌, రజకసంఘ అధ్యక్షుడు శనిగరం కొమురయ్య, నాయకులు సావనపెల్లి రాములు, సామ నర్సింహ్మరెడ్డి, తడకపెల్లి రాములు, శనిగరం చంద్రయ్య, శ్రీనివాస్‌, వెంటకేష్‌, రాములు తదితరులు పాల్గొన్నారు.

ఫ గంభీరావుపేట : మండలంలో చాకలి అయిలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించారు. మాజీ జడ్పీటీసీ మల్లుగారి నర్సాగౌడ్‌, కాం గ్రెస్‌ మండల అధ్యక్షుడు హమీద్‌, మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పాపగారి వెంకటస్వామి, బీజేపీ మాజీ అద్యక్షుడు గంట అశోక్‌, బీజే పీ మండల ప్రధానకార్యదర్శి మల్లేశ్‌యాదవ్‌, నాయకులు రాజేందర్‌ రెడ్డి, స్వామి, రజక సంఘం నాయకులు బాలభూదయ్య, దివిటి నర్స య్య, గూడెపు రవి, రమేష్‌, అశోక్‌, లింబాద్రి, సత్తయ్య, మల్లయ్య తదిత రులు ఉన్నారు.

ఫ చందుర్తి : మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాలయల్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు శుక్రవా రం ఘనంగా నిర్వహించారు. సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ తిప్పని శ్రీని వాస్‌, నాయకులు సిరికొండ శ్రీనివాస్‌, సుద్దాల నర్సయ్య, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గోన్నారు.

ఫ బోయినపల్లి : మండలంలో చాకలి అయిలమ్మ జయంతి వేడుకల ను ఘనంగా నిర్వహించారు. విలాసాగర్‌లో కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడు ఏనుగుల కనకయ్య, మాజీ సర్పంచ్‌ సంభ లక్ష్మిరాజం, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2025 | 01:54 AM