Share News

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు..

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:33 PM

జిల్లాలో అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజన్‌ ఆదేశించారు.

అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు..

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అర్హులందరికీ సదరం సర్టిఫికెట్లు అందించాలని సెర్ప్‌ సీఈవో దివ్యదేవరాజన్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం సదరం శిబిరాల నిర్వహణ, యూడీఐడీ తదితర అంశాలపై ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌తో సమీక్షా సమావేశాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా సదరం శిబిరాల నిర్వహణ, పెండింగ్‌ అప్లికేషన్‌ల వివరాలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా సీఈవో మాట్లాడుతూ సదరం శిబిరాలు క్రమంతప్పకుండా నిర్వహించాలని, దరఖాస్తుదారులకు సమాచారం చేరవేయాల ని, అందరు విధిగా శిబిరాలకు హాజరయ్యేలా చూడాలన్నారు. వైకల్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల్లో వసతులు కల్పించాలని సూచించారు. భవనాలు, పర్నిచర్‌, ఇతర సౌక ర్యాల కోసం నిధులు ప్రభుత్వం మంజూరుచేస్తుందని, అధికా రులు ఏర్పాట్లు పూర్తిచేయాలని ఆదేశించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం అవసరమైనే వైద్యులను నియమించుకోవాల న్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకున్న వారికి వెంటవెంటనే నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని అదేశించారు. యూడీఐడీ కార్డుల జారీ ఇతర అంశాలపై వివరించారు.

జిల్లాలో అన్ని ఏర్పాట్లు..

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా వైకల్య నిర్ధారణ పరీక్ష కేంద్రంలో అన్ని వసతులు కల్పిస్తామని ఇన్‌చార్జి కలె క్టర్‌ గరిమఅగ్రవాల్‌ తెలిపారు. అప్లికేషన్లు పెండింగ్‌లో లేకుం డా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వీడియో కాన్ఫరె న్స్‌లో అదనపు డీఆర్‌డీవో శ్రీనివాస్‌, జీజీహెచ్‌ సూపరింటెం డెంట్‌ డాక్టర్‌ ప్రవీణ్‌, డీపీఎం వంగ రవీందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:33 PM