Share News

భూధార్‌ ఉంటేనే కేంద్ర పథకాల వర్తింపు

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:03 AM

భూధార్‌ కార్డు ఉంటేనే వ్యవసాయ పరంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తించను న్నాయి. ఆ మేరకు తప్పనిసరిగా భూధార్‌ గుర్తింపు కార్డు పొందాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికలు, గ్రామాలకు వెళ్లి భూముల వివరాలను నమోదు చేస్తున్నారు.

 భూధార్‌ ఉంటేనే కేంద్ర పథకాల వర్తింపు
ముత్తారం మండలం మచ్చుపేటలో రైతుల భూముల వివరాలు సేకరిస్తున్న ఏఈఓలు

- ఆధార్‌ మాదిరిగా రైతులకు భూధార్‌ కార్డులు

- పట్టా భూములు కలిగిన వారి వివరాలే నమోదు

- రైతువేదికలు, గ్రామాల్లో నమోదు చేస్తున్న ఏఈవోలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

భూధార్‌ కార్డు ఉంటేనే వ్యవసాయ పరంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వర్తించను న్నాయి. ఆ మేరకు తప్పనిసరిగా భూధార్‌ గుర్తింపు కార్డు పొందాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు జిల్లాలో వ్యవసాయ విస్తీర్ణాధికారులు రైతు వేదికలు, గ్రామాలకు వెళ్లి భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 25 శాతం వరకు నమోదు ప్రక్రియ ముగిసిందని చెబుతున్నారు. ఆధార్‌కార్డు మాదిరిగా సొంత భూము లు కలిగిన రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం భూధార్‌ సంఖ్యను కేటాయిస్తుంది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్‌ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు చేపట్టింది. భూమి హక్కులను ధ్రువీకరించేందుకు ఆధీకృత రికార్డులు కలిగిన రైతు లకు మాత్రమే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, రాయితీలు, బ్యాంక్‌ రుణాలు వంటి సౌకర్యాలకు భూధార్‌ తప్పని సరి అని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు జిల్లాలో ఈ నెల 5వ తేదీ నుంచి రైతువేదికల్లో ఆన్‌లైన్‌లో భూముల వివరాలను నమోదు చేయడంతో పాటు గ్రామాలకు వెళ్లి కూడా వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వివరాలు నమోదు చేస్తున్నారు.

ఫ 25 శాతం భూముల వివరాలు నమోదు..

జిల్లాలో సుమారు 2 లక్షల 90 వేల ఎకరాల సాగు భూములు ఉండగా, ఆ భూములను 1,61,743 మంది రైతులు పట్టాలు కలిగి ఉన్నారు. ఇప్పటి వరకు భూధార్‌ కోసం 40 వేల మంది రైతుల భూముల వివరాలను నమోదు చేశారు. వచ్చే నెల 5వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ, పొడిగించే అవకాశాలు లేకపోలేదని వ్యవసాయ శాఖాధికారులు పేర్కొంటు న్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఒక పోర్టల్‌ను రూపొం దించింది. దానికి సంబంధించిన యాప్‌ను ఏఈవోలు మొబైల్‌ ప్లే స్టోర్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకుని లాగిన్‌ అవుతున్నారు. పట్టా భూములు కలిగిన రైతుల ఆధార్‌ నంబర్‌ నమోదు చేయగానే, అప్పటికే ఆ పోర్టల్‌లో సంబంధిత రైతుల భూముల వివరాలు వస్తుం టాయి. రైతులు తీసుకవచ్చిన పట్టాదారు పాసు పుస్త కాల్లో ఉన్న వివరాలను సరి చూసుకుని నమోదు చేస్తున్నారు. మొదట ఒక తాత్కాలిక రిజిస్ట్రీ నంబర్‌తో రైతుల భూముల వివరాలను నమోదు చేస్తున్నారు. ఆ తర్వాత 11 అంకెలు గల భూధార్‌ నంబర్‌ను కేటా యించనున్నారు. అయితే కేవలం నంబర్‌ మాత్రమే కేటాయిస్తారా, కార్డు జారీ చేస్తారా అనే విషయమై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. డిజిటల్‌ అగ్రిమి షన్‌ కార్యక్రమంలో భాగంగా రైతులందరికి విశిష్ట గుర్తింపు సంఖ్యను జారీ చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నది.

ఫ ముమ్మరంగా భూముల వివరాలు నమోదు..

వ్యవసాయశాఖ రైతువేదికలతోపాటు ఏఈవోలు ముందస్తుగా రైతులకు సమాచారం ఇచ్చి గ్రామాలకు వెళ్లి కూడా భూధార్‌ కోసం వివరాలను ముమ్మరంగా నమోదు చేస్తున్నారు. ఫార్మర్‌ రిజిస్ట్రీలో వివరాలను నిక్షిప్తం చేస్తున్నారు. రైతులు వ్యవసాయ శాఖ ఏఈ వోల వద్దకు ఆధార్‌ కార్డు. పట్టాదారు పాసుబుక్‌, అడంగల్‌ పహాణి, ఆధార్‌ లింక్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ తీసుకెళ్లాలి. భూభారతి పోర్టల్‌, రికార్డ్స్‌ ఆఫ్‌ రైట్స్‌, పట్టాదారు పాస్‌ పుస్తకాల ఆధారంగా రైతుల యాజ మాన్య హక్కులను నిర్ధారించి వివరాలను నమోదు చేస్తారు. ఆ తర్వాత 11 అంకెల విశిష్ట సంఖ్యను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. భూధార్‌ ఐడీ నంబర్‌ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఏం కిసాన్‌ యోజన, బీమా, ఈజీఎస్‌ పనులు, మొక్కల పెంపకం మంజూరు చేయనున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ పథకాలైన రైతు భరోసా, రుణమాఫీ, తదితర పథకా లకు ఫార్మర్‌ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదని జిల్లా వ్యవసాయశాఖ అధికారి దోమ ఆదిరెడ్డి తెలి పారు. జిల్లాలో రెవెన్యూ రికార్డుల్లో మ్యాపింగ్‌ కాని భూములు, రెండు పాస్‌ పుస్తకాలు కలిగిన రైతులు, ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులకు భూధార్‌ ఐడీ నంబర్‌ కేటాయింపు ప్రక్రియను నమోదు చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. పట్టాలు కలిగిన రైతులు ఏఈవోల వద్ద భూముల వివరాలను నమోదు చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. జిల్లాలో కౌలు రైతులతోపాటు అసైన్డ్‌, దేవాదాయ భూములు, అటవీ భూములు సాగు చేసుకునే చాలామంది రైతులకు నేరుగా యాజమాన్య హక్కులు లేవని, వీరం దరికీ కూడా కేంద్ర పథకాలు వర్తించే విధంగా భూధార్‌ కార్డులను ఇవ్వాలని రైతు సంఘాల నాయ కులు కోరుతున్నారు.

Updated Date - Jun 01 , 2025 | 01:03 AM