మిడ్ మానేరు డ్యాంను పరిశీలించిన కేంద్ర అధికారులు
ABN , Publish Date - Jun 13 , 2025 | 12:42 AM
రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రెటరీ సెంతల్ రాజన్ చొక్కాలింగం ఆధ్వర్యంలో అధికారులు గురువారం పరిశీలించారు.
బోయినపల్లి, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మానువాడ మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ను సెంట్రల్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ జాయింట్ సెక్రెటరీ సెంతల్ రాజన్ చొక్కాలింగం ఆధ్వర్యంలో అధికారులు గురువారం పరిశీలించారు. ప్రాజెక్ట్ వివరాలు ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో వివరాలు తెలుసుకున్నారు. నీటిని ఏఏ ప్రాంతాలకు తరలిస్తున్నారో రిపోర్ట్ తీసుకున్నారు. పూర్తి వివరాలను పరిశీలించి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో సైంటిస్ట్ సుధీర్ కుమార్, కృష్ణ, గోదావరి బేసిన్ ఆర్గనైజేషన్ ఈఈ ధీరజ్ సింఘాల్, ప్రాజెక్ట్ ఈఈ జగన్, డీఈలు రాజు, శ్రీనివాస్, ఏఈలు రాధిక, అనుపమ, వర్క్ ఇన్‌స్పెక్టర్ రాజేష్ పాల్గొన్నారు.