బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం
ABN , Publish Date - Dec 22 , 2025 | 12:43 AM
బీసీ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి ఆదివారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలి పింది.
సిరిసిల్ల టౌన్, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి) : బీసీ బిల్లుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని బీసీ హక్కుల సాధన సమితి ఆదివారం జిల్లా కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలి పింది. ఈసందర్భంగా బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కన్వీనర్ పంతం రవి మాట్లాడారు. బీసీల హక్కుల సాధన కోసం బీసీలంతా ఐక్యంగా పోరాటాలు చేసే సమయం ఆసన్నమైందన్నారు. భారత దేశ జనాభలో సగా నికిపైగా ఉన్న బీసీల 42 శాతం రిజర్వేషన్లపై పార్లమెంట్ శీతాకాలం సమవేశంలో బీజేపీ కనీ సం చర్చ పెట్టపోవడం దుర్మార్గమన్నారు. బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల వైఖరి ఒకేలా ఉండడం బాధాకరమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గానికి ఉపాధి చూపిస్తున్న నరేగా చట్టాన్ని కేంద్రప్రభుత్వం నిర్వీర్యం చేయ డానికి గాంధీజీ పేరుతో ఎవరు పలకకూడదని జీ రామ్ జీ బిల్లుతోపాటు మరో ఎనిమిది బిల్లు లను పార్లమెంట్ సమావేశంలో ఆమోదింప చేసుకుందని ఆరోపించారు.దేశవ్యాప్తంగా బీసీల సమస్యలపై ఆందోళనలు జరుగుతుండగా బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిం చడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు విద్యా, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర అసెంబ్లీలో బిల్లును ఆమోదింప జేసి కేం ద్రానికి పంపిన ఇప్పటివరకు స్పందించకపోవ డం బీసీల పట్ల నిర్లక్ష్యంకు నిదర్శనమని మండి పడ్డారు. తెలంగాణలో అధికారంలో ఉన్న కాం గ్రెస్ ప్రభుత్వం మరోసారి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడం కోసం అఖిలపక్షం పార్టీల ను ఢిల్లీలోని ప్రధానమంత్రి వద్దకు తీసుకపోవ డం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్ర మంలో సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి గుంటి వేణు, నాయకులు సోమనాగరాజు, గుండేటి చంద్రమౌళి, సత్తన్న, రాజన్న పాల్గొన్నారు.