నిరుపేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Sep 06 , 2025 | 12:56 AM
నిరుపేదల సంక్షేమం కోసం కేంద్రంప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో నిరుపేద కుటుంబాలపై ఖర్చుల భారం తగ్గుతుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపీ అన్నా రు.
సిరిసిల్ల రూరల్, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి) : నిరుపేదల సంక్షేమం కోసం కేంద్రంప్రభుత్వం జీఎస్టీని తగ్గించడంతో నిరుపేద కుటుంబాలపై ఖర్చుల భారం తగ్గుతుందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డ బోయిన గోపీ అన్నా రు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పేదల సంక్షే మమే ఽధ్యేయంగా ముందుకు సాగుతోందన్నారు. తాజాగా జీఎస్టీ తగ్గింపు నిర్ణ యంతో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబాలకు లాభం చేకూరుతుందన్నారు. జీఎస్టీ తగ్గింపు ఈనెల 27నుంచి అమలులోకి వస్తుంద న్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మ్యాన రాంప్రసాద్, మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్య దర్శి కర్నే హరీష, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బర్కం వెంకటలక్ష్మీ, పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్, అసాని రాంలింగారెడ్డి, వంతడ్పుల సుఽధాకర్, ల్యాగ ల భాగయ్య, చొప్పదండి శ్రీనివాస్, పల్లికొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.