Share News

గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు

ABN , Publish Date - Nov 28 , 2025 | 12:38 AM

గ్రామాల అభివృద్ధికి కేంద్రం కోట్లాది రుపాయాలు నిధులు వెచ్చిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

గ్రామాల అభివృద్ధికి కేంద్రం నిధులు

తంగళ్లపల్లి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కేంద్రం కోట్లాది రుపాయాలు నిధులు వెచ్చిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. బుధవారం తంగళ్లపల్లి మండల బీజేపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరై గ్రామపంచాయతీ ఎన్నికలపై దిశ నిర్ధేశం చేశారు. అనంత రం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండేళ్లుగా గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించకుండా అభి వృద్ధిని అడ్డుకుందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ఈజీఎస్‌ ద్యారా అంగన్‌వాడీ సెంటర్లు, గ్రామాల్లో సీసీరోడ్లు నిర్మాణం తదిత ర అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. ఈ ఏడాది కేవలం తంగళ్లపల్లి మండలంలో సుమారు 1.50 కోటి అభివృద్ధి పనులు చేపట్టినట్లు, అలాగే బండి సంజయ్‌ ఎంపీ నిధుల నుంచి 15 బోరు బావులు ఏర్పాటు చేశారన్నారు. ఎంపీ నిధుల నుండి రోడ్లు, కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు జరిగాయని గుర్తు చేశారు. బండి సంజయ్‌ ఎంపీగా గ్రామాల అభివృద్ధికి పాటుపడుతున్నాడని, గ్రామ పంచాయతీలలో బీజేపీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించుకోవాలని అన్నారు. నిధులు లేవని ముఖ్యమంత్రి ప్రకటించాడని, అందుకే కాంగ్రెస్‌ ను దూరం పెట్టి గ్రామాల అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తున్న ఎంపీ బండి సంజయ్‌కు మద్దతు పలకాలని కోరారు. ఏకగ్రీవంగా బీజేపీ బలపరిచిన అభ్యర్థిని ఎన్నుకున్న గ్రామ పంచాయతీలకు ఎంపీ నిధులు రూ.10లక్షలు మంజూరు చేస్తామని ఎంపీ బండి సంజయ్‌ ప్రకటించిన ట్లు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ మండల ఇన్‌చార్జీ దుమాల శ్రీకాంత్‌, మండల బీజేపీ అధ్యక్షుడు వెన్నమనేని శ్రీధర్‌రావు, బీజేవైఎం జిల్లా అఽధ్యక్షుడు రాగుల రాజిరెడ్డి, నాయకులు రాజు, లింగారెడ్డి, వినయ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2025 | 12:38 AM