సెల్ టవర్ నిర్మాణ పనులు నిలిపివేయాలి
ABN , Publish Date - Aug 25 , 2025 | 12:38 AM
జిల్లా కేంద్రం లోని భాగ్యనగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్న సెల్ టవర్ పనులను నిలుపుదల చేయాలని కోరుతూ కలెక్టర్ సత్యప్రసాద్‌కు మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆదివా రం లేఖను రాశారు.
- కలెక్టర్‌కు మాజీమంత్రి జీవన్‌రెడ్డి లేఖ
జగిత్యాల, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రం లోని భాగ్యనగర్ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం అవుతున్న సెల్ టవర్ పనులను నిలుపుదల చేయాలని కోరుతూ కలెక్టర్ సత్యప్రసాద్‌కు మాజీమంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆదివా రం లేఖను రాశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుం డా, నిబంధనలకు విరుద్ధంగా టవర్ల నిర్మాణం జరుగుతుండడం సమంజసం కాదన్నారు. పాఠశాలలు, ఆసుపత్రులకు వంద మీటర్ల దూరంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టాలని స్పష్టంగా నిబంధనలున్నప్పటికీ భాగ్యనగర్‌లో పాఠశాలకు, నివాసిత ప్రాంతాల్లో సెల్ టవర్ ఏర్పాటు చేస్తున్నారని వివరించారు. దీనివల్ల వృద్ధులు, చిన్నారులు, గర్భిణులపై తీవ్ర ప్రభా వం చూపి చర్మ సంబంధిత, క్యాన్సర్ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే విచారణ జరిపించి నిర్మాణ పనులను నిలిపివేయాలని కలెక్టర్ సత్యప్రసాద్‌కు పంపిన లేఖలో మాజీ మంత్రి జీవన్‌రెడ్డి కోరారు.
జగిత్యాల అర్బన్: జగిత్యాల పట్టణంలోని భా గ్యనగర్ కాలనీ వాసులు మాజీ మంత్రి జీవన్‌రె డ్డిని ఆదివారం కలిశారు. తమ నివాస గృహాల మధ్య సెల్ టవర్ నిర్మాణం చేస్తున్నా రని ఈ విషయమై అనేకసార్లు విజ్ఙప్తి చేసినప్పటికి అధికారులు స్పందించడం లేదని వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో భాగ్యనగర్ కాలనీ వాసులు, మాజీ కౌన్సిలర్ మొగిలి, మల్యాల మాజీ జడ్పీటిసీ రాంమోహన్‌రావు ఉన్నారు.