నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అవసరం
ABN , Publish Date - Oct 30 , 2025 | 12:09 AM
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు.
వేములవాడ క్రైం, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఎస్పీ మహేష్ బి. గీతే అన్నారు. బుధ వారం వేములవాడ పట్టణ పరిధిలో ఏఎంఏ సౌజన్యం తో ఏర్పాటుచేసిన ఆటోమెటిక్ కెమెరాలను అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డితో కలిసి ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారస్థులు, ప్రజాప్రతినిధులు ముందుకు రావాలన్నారు. వేములవాడ పట్టణ పరిధి లోని కోరుట్ల బస్టాండ్, సాయిరక్ష చౌరస్తా, తిప్పాపూర్ బస్టాండ్, కరీంనగర్, సిరిసిల్ల వైపు వెళ్లే రహదారి, మూలవాగు వంతెన వద్ద ఆటోమెటిక్ నంబర్‌ప్లేట్ రిక గ్నేషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కెమెరాల ద్వారా పట్టణంలోని ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి ఏ వాహనాలు, ర్యాష్ డ్రైవింగ్, త్రిబుల్ డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, నెంబర్ ప్లేట్లు లేకుండా తిరిగే వాహనాల నంబర్ ప్లేట్స్‌ను ఆటోమెటిక్‌గా సీసీ కెమెరాలు స్కాన్‌చేసి సంబంధిత వాహనాల యజమానులకు ఈ-చాలన్ జారీ చేస్తాయ న్నారు. ఈఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ట్రాఫి క్ ఉల్లంఘనలను నియంత్రించడం, చోరీ వాహనాలను గుర్తించడం, అనుమానిత వాహనాలు గుర్తించడం, నేరపరిశోధనలో వేగం పెరగడం వంటి ప్రయోజనాలు కలుగుతాయన్నారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధ నలు పాటించి హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగం, డ్రంకె న్‌డ్రైవ్ వంటి నియమాలను తప్పకుండా పాటించాల న్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ సీఐ వీరప్రసాద్, రూ రల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు రామ్మోహాన్, ఎల్లాగౌడ్, రాజు, వెంకట్రాజం, డాక్టర్ కె. మనోహార్, డాక్టర్ శ్రీని వాస్, డాక్టర్ ఆనందరెడ్డిలు పాల్గొన్నారు.