సీసీఎస్‌స్టేషన్ నూతన కార్యాలయం ప్రారంభం
ABN , Publish Date - Oct 28 , 2025 | 12:02 AM
కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రైషన్ స్టేషన్‌ను (సీసీఎస్) పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం సోమవారం ప్రారంభించారు.
కరీంనగర్ క్రైం, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ క్రైషన్ స్టేషన్‌ను (సీసీఎస్) పోలీస్ కమిషనర్ గౌస్‌ఆలం సోమవారం ప్రారంభించారు. ఇప్పటి వరకు సీసీఎస్ కరీంనగర్ టూ టౌన్ పోలీసుస్టేషన్ భవనం పైన ఉండేది. కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయ కాంపౌండ్‌లో నిర్మించిన నూతన భవనంలోకి సీసీఎస్‌ను తరలించారు. ఈ సందర్భంగా సీపీ గౌస్‌ఆలం పూజా కార్యక్రమాలు నిర్వహించి, నూతన కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. నూతన భవనం ద్వారా సీసీఎస్ పోలీసు స్టేషన్ సిబ్బందికి మెరుగైన వాతావరణం లభిస్తుందని, అధికారులు, సిబ్బంది మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తారన్నారు. సీసీఎస్ పోలీసుస్టేషన్ సేవలు పోలీస్ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తాయని, ముఖ్యంగా నేరస్థులను పట్టుకోవడంలో వారి సహకారం ఎంతో ముఖ్యమని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు వెంకటరమణ, భీం రావు, ఏసీపీలు శ్రీనివాస్, వెంకటస్వామి, విజయకుమార్, యాదగిరిస్వామి, వేణుగోపాల్, సీసీఎస్ పీఎస్ ఇన్‌స్పెక్టర్ ప్రకాష్ పాల్గొన్నారు.