ప్రధాన రోడ్లపై పశువుల సంచారం
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:55 PM
జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై పశువులు సంచరిస్తున్నాయి.
సిరిసిల్ల టౌన్, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లపై పశువులు సంచరిస్తున్నాయి. స్థానిక గాంధీనగర్‌లోని కూరగాయల మార్కెట్లోకి పశువులు చొరబడుతున్నాయి. రోడ్లపై పశువులు సంచరిస్తుం డడంతో తరచూ వాహనదారులు ప్రమాదాల బారినపడి ఆసుపత్రుల పాలై న సంఘటనలు ఉన్నాయి. రోడ్లపై పశువులు కొట్లాడుతూ దుకాణాలు, వాహనాలపైకి దూసుకువచ్చిన సంఘటనల్లో కూడా ప్రమాదాలు జరిగాయి. కూరగాయల మార్కెట్లోకి పశువులు ప్రవేశించి రైతులు కష్టపడి పండించిన కూరగాయలను తింటూ ధ్వంసం చేస్తున్నాయి. సిరిసిల్ల గ్రామపంచాయతీగా ఉన్న సమయంలో రోడ్లపై పశువులు తిరిగితే కొట్టంలో వేసి యజమానుల కు జరిమానా విధించేవారు. సిరిసిల్ల మున్సిపల్‌గా మారి తర్వాత జిల్లాగా మారింది. జిల్లా కేంద్రంగా అభివృద్ధి సాధిస్తున్నా పశువులు బెడద లేకుండా అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం విఫలమైనారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. పట్టణ రోడ్లపై పశువులు కనపడకూడదని, కనిపిస్తే వేము లవాడ గోశాలకు తరలిస్తామంటూ మున్సిపల్ కమిషనర్ ఖాదీర్‌పాషా గత నెలలో ప్రకటనలు ఇచ్చినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ సిరిసిల్ల పట్టణం ప్రధాన రోడ్లతో పాటు వీధులో కూడా పశువులు దర్శనం ఇస్తున్నా యి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవా లని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.