కాంగ్రెస్ పోరాటంతోనే దేశంలో కులగణన
ABN , Publish Date - Jun 21 , 2025 | 12:16 AM
:కాంగ్రెస్ పార్టీ పోరాటంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలుగణనకు ముందుకు వచ్చిందని ఎన్‌ఎస్‌యఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఆన్నారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి ఇమ్రాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇందిరాచౌక్ నుంచి సివిఆర్‌ఎన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారత్ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు.
గణేశ్‌నగర్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి):కాంగ్రెస్ పార్టీ పోరాటంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కలుగణనకు ముందుకు వచ్చిందని ఎన్‌ఎస్‌యఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎడవల్లి వెంకటస్వామి ఆన్నారు. శుక్రవారం ఎన్‌ఎస్‌యుఐ మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.డి ఇమ్రాన్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇందిరాచౌక్ నుంచి సివిఆర్‌ఎన్ రోడ్డు మీదుగా కోర్టు చౌరస్తా, అంబేద్కర్ విగ్రహం వరకు పెద్ద ఎత్తున భారత్ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఎడవల్లి వెంకటస్వామి మాట్లాడుతూ రాజ్యాంగంపై జరుగుతున్న దాడులను విద్యార్థులకు వివరిస్తామన్నారు. దేశవ్యాప్త కులగణన కోసం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచిన రాహుల్‌గాంధీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్‌ఎస్‌యూఐ ఆధ్వర్యంలో భారత్ సంవిధాన్ బచావో ర్యాలీలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ఎన్‌ఎస్‌యూఐ పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. వారి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జిల్లా ఆర్టీఏ మెంబర్ పడాల రాహుల్, కరీంనగర్ పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉప్పరి విశాల్, ఎన్‌ఎస్‌యుఐ నాయకులు సాయి, ప్రశాంత్, జియా ఉల్లా, బిస్మి, విక్రం, అజ్మత్, శివ, అనిల్, సాయిచరణ్, మనోజ్, గట్టు, సమీర్, వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.