Share News

నేల ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి

ABN , Publish Date - Dec 06 , 2025 | 12:51 AM

నేల ఆరోగ్య పరిర క్షణలో ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి అప్జల్‌ బేగమ్‌ సూచించారు.

నేల ఆరోగ్య పరిరక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి

తంగళ్లపల్లి, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): నేల ఆరోగ్య పరిర క్షణలో ప్రతి రైతు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖాధికారి అప్జల్‌ బేగమ్‌ సూచించారు. వ్యవసాయ కళాశాల దత్తత గ్రామం తంగళ్లపల్లి మండలం రాళ్లపేటలో ప్రపంచ మృత్తికా దినోత్సవం(హెల్త్‌సాయిల్‌ ఫర్‌ హేల్తీ సిటిస్‌) నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథితిగా హాజరైన వ్యవ సాయ శాఖాధికారి మాట్లాడుతూ పట్టణీకరణ పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య కరమైన నేలలు- ఆరోగ్యకరమైన పట్టణాల నిర్మాణానికి పునాది అన్నారు. వ్యవసాయ కళాశాల డీన్‌ సునీతదేవి మాట్లాడుతూ అర్బన్‌ ఫార్మింగ్‌, నేల ఆరోగ్యం ప్రాముఖ్యత గూర్చి వివరించారు. ఈ సందర్బంగా డాక్టర్‌ సాయికుమార్‌, డాక్టర్‌ సంపత్‌కుమార్‌, డాక్టర్‌ అరుణ్‌ బాబు, ఇఫ్‌కో మేనేజర్‌ నరేష్‌లు నేల పరిరక్షణ, ఆధునిక పద్ధతుల వ్యవసాయం తదితర అంశాలను వివ రించారు. అనంతరం రైతులకు నేల భూసార పరీక్ష పత్రాలను ఆందజే శారు. విద్యార్దులు నిర్వహించిన వర్మీకంపోష్టు, నేలలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ కార్యక్రమంలో ఎంఏవో సంజీవ్‌, సాయి కిరణ్‌, ఏఈవో అనుష, విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - Dec 06 , 2025 | 12:51 AM