Share News

అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

ABN , Publish Date - May 03 , 2025 | 11:24 PM

నీట్‌ అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శనివారం ఎల్‌ఎండీ కాలనీలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు.

అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి

తిమ్మాపూర్‌: నీట్‌ అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి తెలిపారు. శనివారం ఎల్‌ఎండీ కాలనీలోని కేంద్రీయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన నీట్‌ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులు పెన్నులు, పెన్సిళ్లను, ఇతర ఎలాంటి వస్తువులను ఎట్టి పరిస్ధితుల్లోనూ తీసుకురావద్దని సూచించారు. అభ్యర్థులకు అవసరమయ్యే పెన్నులను నిర్వాహకులే సమకూరుస్తారని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ట్రాఫిక్‌ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులను ఆదేశించారు. 087-2997247 నంబర్‌కు ఫోన్‌ చేసి అభ్యర్థులు సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.

నీట్‌కు పటిష్ట బందోబస్తు....

కరీంనగర్‌ క్రైం: కమిషనరేట్‌ పరిధిలో నిర్వహించనున్న నీట్‌ (యూజీ) పరీక్ష కొరకు పటిష్ట బందోబస్తుతో పాటు ట్రాఫిక్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు సీపీ గౌస్‌ ఆలం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 150 మంది పోలీసు అధికారులను బందోబస్తుకు కేటాయించామన్నారు. ఏసీపీ మాధవిని ఈ పరీక్షకు నోడల్‌ అధికారిగా నియమించామన్నారు.

Updated Date - May 03 , 2025 | 11:24 PM